అమరావతి.ఈ పేరు వింటేనే కొత్త ఆంద్రప్రదేశ్ ప్రజలకు ఎక్కడో గుడిగంటలు కొట్టినట్లు అనిపిస్తుంది.ఏపీ రాజధాని కాస్తా., ఇపుడు రాజకీయ రాజధానికి మారిపోయిన వైనం.ఏపీ హై కోర్టు నుంచి భారత అత్యున్నత న్యాయ స్థానం సుంప్రీం కోర్టువరకూ అర్ధమైపోయింది.దాంతో ఏపీలోని రాజకీయ ఎత్తు గడలకు చెక్ పెడుతూ అమరావతే రాజధానికిగా ఉండాలంటూ తీర్పు నిచ్చింది.
అయినా తాజాగా ఏపీ ప్రభుత్వం మాత్రం సుప్రీం కోర్టు తీర్పును పక్కనపెట్టేసి మూడు రాజధానుల ప్రక్రియ ఇపుడు తెరపైకి వస్తుందనే విమర్శలు హాట్ హాట్ గా వినిపిస్తున్నాయి.ఎవరేమన్నా తగ్గేదే లే అంటున్న ఏపీ ప్రభుత్వం తాజాగా రాజధానిని వైజాక్ కు తరలిస్తామంటూ ఝులక్ లు ఇస్తుంది.
దాంతో ఇక్కడ విపక్షాలు అమరావతే తమకు రాజధాని అంటూ పోరాటానికి సిద్ధమవుతున్నాయి.
తాజాగా విశాఖకు రాజధాని తరలింపుపై సీఎం జగన్ వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారు.
అదే సమయంలో విశాఖకు రాజధాని తరలింపుపై వైసీపీ కీలక నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై ఇపుడు తీవ్ర గందరగోళం నెలకొంది.అమరావతే రాజధాని అంటూ ఓ వైపు జనసేన, టీడీపీ లు ఇక్కడ రైతులతో చేయి కలిపితే తాజాగా బీజేపీ కూడా ఇపుడు పోరాటంలో జత కలుస్తుంది.
దాంతో ఇపుడు వైసీపీ ప్రయోగాలకు చెక్ పెట్టే దిశగా విపక్షాలు పావులు కదుపుతున్నాయి.
ఇపుడు తాజా పరిణామాలప్రకారం ఏపీ ప్రజలకు రాజధాని లేకుండా చేశారంటూ బీజేపీ ఆరోపిస్తుంది.దీనిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు అధ్వర్యంలో ‘మనం-మన అమరావతి’ పేరుతో పాదయాత్ర చేపట్టారు.రాజధాని విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎక్కడా మోసం చేయలేదన్నారు సోము వీర్రాజుచంద్రబాబు ప్రభుత్వంలో నిధులను చాలినంతగా విడుదల చేసిందన్నారు.
ప్రభుత్వం మారినపుడల్లా, రాజధానుల మారాతాయా అని ప్రశ్నించారు.వ్యక్తిగత స్వలాభాన్ని పక్కన పెట్టి రాష్ట్రాభివృద్ధిని జగన్ దృష్టిలో పెట్టుకోవాలంటూ హితవు పలికారు.ఎయిమ్స్, వ్యవసాయ విశ్వవిద్యాలయం, బైపాస్ రోడ్లు, ఫ్లైఓవర్లు నిర్మించాం.రాజధానిలో అంతర్గత రహదారులు, డ్రైనేజీలను కూడా కేంద్రమే నిర్మిస్తుందని తెలిపారు.
రాజధాని రైతులను ఆదుకోవడంపై బీజేపీ దృష్టి సారించిదన్నారు.తాజాగా పరిణామాల ప్రకారం జగన్ పట్టిన పట్టుపై విపక్షాలు ఉక్కుపట్టు పట్టే విధంగా కనిపిస్తున్నాయి.
అమరావతి రాజధాని తప్ప ఊరుకో రాజధాని నిర్మించే ప్రక్రియను జగన్ మానుకోవాలని బీజేపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు.