కృష్ణా జిల్లాలో ఉండే అవనిగడ్డ నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గం అత్యంత బలంగా ఉంటుంది.ఈ నియోజకవర్గంలో మొత్తం ఓటర్లలో 75 శాతం మంది కాపు ఓటర్లే.
అందుకే ఇక్కడి నుంచి అన్ని రాజకీయ పార్టీలు దశాబ్దాలుగా కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలకే టిక్కెట్లు కేటాయిస్తూ ఉంటాయి.జనసేన పార్టీ కాపు సామాజికవర్గానిది కావడంతో ఆ పార్టీ అభ్యర్థి కొంచెం కష్టపడితే ఇక్కడ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
అవనిగడ్డ ఏపీ రాజకీయాలకు పురిటిగడ్డ అని అందరూ భావిస్తుంటారు.ఎంతో మంది ఉద్దండులైన రాజకీయ ప్రముఖులను రాష్ట్రానికి అందించిన అవనిగడ్డ నియోజకవర్గంలో ఇప్పుడు పొలిటికల్‌గా ముక్కోణపు వార్ నడుస్తోంది.2019 ఎన్నికల్లో అవనిగడ్డ నుంచి జనసేన పార్టీ గెలుపు ఖాయమనే ప్రచారం జరిగింది.2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి సింహాద్రి రమేష్, టీడీపీ నుంచి మండలి బుద్ధప్రసాద్, జనసేన పార్టీ నుంచి ముత్తంశెట్టి కృష్ణారావు.వీరు ముగ్గురూ కాపు సామాజికవర్గానికే చెందినవారే.వీరిలో వైసీపీ అభ్యర్థి సింహాద్రి రమేష్ గెలుపొందారు.
జనసేన పార్టీ అభ్యర్థి ముత్తంశెట్టికి దాదాపు 29 వేల ఓట్లు పోలయ్యాయి.జనసేన అభ్యర్థి 16 శాతం ఓట్లు సాధించి మూడో స్థానంలో నిలిచారు.గత ఎన్నికల్లో స్థానికేతర అభ్యర్ధి.వైసీపీ గాలి.
తదితర కారణాలతో జనసేన మూడో స్థానానికి పరిమితం అయినా ఈ సారి ఖచ్చితంగా సీటు కొట్టేస్తామన్న నమ్మకం అక్కడి నాయకత్వంలో ఉంది.అయితే ఆ గెలుపుకు అవసరమైన వ్యూహాలను జనసేన ఎంత వరకు అమలు చేస్తుందనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలింది.
ముత్తంశెట్టి స్థానిక అభ్యర్థి కాకపోవడంతో వచ్చే ఎన్నికల్లో స్థానికుడికే టిక్కెట్ కేటాయించాలని జనసేన అధిష్టానం యోచిస్తోంది.ఇటు టీడీపీ, అటు వైసీపీలోని ప్రత్యర్థులను ఢీకొట్టే నాయకులు జనసేనకు ఉన్నారా అన్నది అసలు సమస్య.నియోజకవర్గ స్థాయిలో పార్టీని బలంగా కాచుకునే ఇంఛార్జ్ లేకపోవడం.ఉన్న ద్వితియశ్రేణి నాయకత్వం అంతా ఆ పదవి కోసం పోటీ పడే పనిలో బిజీగా ఉండి పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లే కార్యక్రమాన్ని మర్చిపోవడం వంటి అంశాలు ఈ సారి జనసేన విజయంపై ప్రభావితం చూపబోతున్నాయి.
కృష్ణా జిల్లా పార్టీ అధ్యక్షుడు బండి రామకృష్ణ ఇటీవల అవనిగడ్డలో జనసేన పార్టీ కార్యాలయాన్ని తెరిచి కొత్త చర్చకు దారి తీశారు.ఈ నేపథ్యంలో ఆయనకే టిక్కెట్ ఇస్తారా అనేది చర్చనీయాంశంగా మారింది.