సోషల్ మీడియా పరిధి రోజురోజుకీ విస్తరిస్తోంది.దాంతో దేశం నలుమూలలా వున్న వింతలూ విశేషాలు ఇట్టే తెలిసి పోతున్నాయ.
అరచేతిలో ఓ స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు.ఇక మనం ఈ ప్రపంచాన్ని జయించినట్టే.
తాజాగా యువత ఏమి తెలుసుకోవాలన్నా తన ఫోన్ వంకే చూస్తోంది.అందువలన ఈ యుగాన్ని ఓ రకముగా స్మార్ట్ ఫోన్ యుగం అని కూడా పిలుస్తూ వున్నారు.
ఇకపోతే సోషల్ మీడియాలో అనేక వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి.అందులో కొన్ని సరదాగా ఉంటే, మరికొన్ని చాలా నవ్వుని తెప్పిస్తాయి.
మరికొన్ని విషాదకర సంఘటను జరుగుతూ ఉంటాయి.ఏదిఏమైనా స్మార్ట్ ఫోన్వున్నవారే ఇలాంటివి చూడగలరు.
ఇకపోతే ఈ మధ్య వైరల్ అవుతున్న వీడియోలలో ఎక్కువగా పెళ్లికి సంబంధించినవే ఉండటం గమనార్హం.అందులోను ముఖ్యంగా కొత్త చేసే డాన్సులు యువత ఎక్కువగా చూస్తోంది.
అందుకే కొన్ని వీడియోలు వైరాలు అవుతున్నాయి.తాజాగా అలాంటి వీడియో ఒకటి చూపరులను ఆకర్షిస్తోంది.
ఛత్తీస్‌ఘడ్‌కు చెందిన దీపాన్షు కాబ్రా అనే ఒక IPS అధికారి తన ట్విట్టర్ అకౌంట్‌లో ఈ వీడియోను షేర్ చేయగా అది కాస్త వైరల్ అవుతోంది.కావాలంటే మీరు కూడా ఓసారి లుక్కేసి మీమీ అభిప్రాయాలను తెలియజేయండి.వీడియోలో కొత్తగా పెళ్లైన ఒక జంట స్టేజ్‌పై ఆకట్టుకునే స్టెప్పులతో అదరగొట్టింది.1994లో వచ్చిన ఖుద్దార్ అనే హిందీ సినిమాలోని ‘తుమ్సా కోయీ ప్యారా’ అనే పాటకు ఈ జంట డాన్స్ చేసి, ఆహుతులను కనువిందు చేసింది.ఒరిజినల్‌గా ఈ పాటలో గోవిందా, కరిష్మా కపూర్ నటించిన విషయం తెలిసినదే.అయితే, తాజాగా ఈ నవ జంట చేసిన డాన్స్ మూవ్స్ అద్భుతంగా ఉన్నాయంటున్నారు మన నెటిజన్స్.
ఇద్దరి మధ్యా కెమిస్ట్రీ బాగుందని, కపుల్.మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటూ నెటిజన్స్ ప్రశంసిస్తున్నారు.
ఇప్పటివరకు ఈ వీడియోకు ఆరు లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయంటే ఎంతమందికి నచ్చుంటుందో అర్థం చేసుకోండి!
.