చాతుర్మాస్య దీక్ష తీసుకున్న పవన్.. ఆ దీక్ష నియమాలు తెలిస్తే షాకవ్వాల్సిందే!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ప్రేక్షకుల్లో క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ ఊహించని స్థాయిలో ఉందనే సంగతి తెలిసిందే.హరిహర వీరమల్లు సినిమాతో పవన్ కళ్యాణ్ కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ను సొంతం చేసుకుంటారని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

 Interesting Facts About Pawan Kalyan  Deeksha Details Here , Deeksha, Pawan Kaly-TeluguStop.com

పవన్ రీఎంట్రీలో నటించిన సినిమాలు కమర్షియల్ గా సక్సెస్ సాధించడంతో పాటు నిర్మాతలకు ఊహించని స్థాయిలో లాభాలను అందించాయనే సంగతి తెలిసిందే.అయితే పవన్ తాజాగా చాతుర్మాస్య దీక్ష తీసుకున్నారని సమాచారం అందుతోంది.

జనసేన అధినేత అయిన పవన్ కళ్యాణ్ చాతుర్మాస్య దీక్షను చేపట్టడం వల్ల నాలుగు నెలల పాటు ఒకపూట మాత్రమే భోజనం చేయనున్నారు.రోజూ పవన్ కళ్యాణ్ సూర్యాస్తమయం తర్వాత మాత్రం పాలు, పండ్లు, రాత్రి సమయంలో అల్పాహారాన్ని తీసుకోనున్నారు.

ఈ దీక్ష ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు ఉంటుందని తెలుస్తోంది.ఎవరైతే ఈ దీక్ష తీసుకుంటారో వాళ్లు కఠిన నియమాలను పాటించాల్సి ఉంటుంది.

నిన్న తొలి ఏకాదశి కావడంతో పాటు మంచి రోజు అనే సంగతి తెలిసిందే.ఈ కారణం వల్లే ఆదివారం రోజున పవన్ కళ్యాణ్ చాతుర్మాస్య దీక్షను మొదలుపెట్టారని తెలుస్తోంది.11 రోజులు, 31 రోజులు, నాలుగు నెలలు ఈ దీక్ష చేసే అవకాశం ఉండగా పవన్ కళ్యాణ్ మాత్రం నాలుగు నెలల పాటు ఈ దీక్షను చేయడం గమనార్హం.ఎవరైనా ఈ దీక్షను తీసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.

Telugu Deeksha, Pawan Kalyan-Movie

ఈ దీక్ష తీసుకునే వాళ్లు ఆహార నియమాలను కచ్చితంగా పాటించాల్సి ఉంటుంది.ఈ దీక్ష చేపట్టిన వాళ్లు పప్పు పదార్థాలకు దూరంగా ఉంటే మంచిదని చెప్పవచ్చు.ఈ దీక్షను తీసుకున్న వాళ్లు ఆకుకూరలు, పెరుగును ఆహారంలో భాగంగా తీసుకుంటే మంచిదని చెప్పవచ్చు.ఉసిరికాయ పచ్చడిని కూడా ఆహారంలో భాగంగా తీసుకోవచ్చు.శాకాహారం భోజనంను తీసుకోవడం ద్వారా ఈ దీక్షను ముగించాల్సి ఉంటుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube