RC15 : స్టన్నింగ్ లుక్ లో చరణ్.. గ్లిమ్స్ వైరల్..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఇటీవలే ట్రిపుల్ ఆర్ సినిమాతో వరల్డ్ వైడ్ గా గుర్తింపు తెచ్చుకుని స్టార్ అయ్యాడు.ఈ సినిమాను రాజమౌళి డైరెక్ట్ చేయడంతో ముందు నుండి భారీ అంచనాలు నెలకొన్నాయి.

 Ram Charan Latest Look Leaked From Shankar Movie Goes Viral-TeluguStop.com

ఆ అంచనాలు నిజం అయ్యేలా బిగ్గెస్ట్ హిట్ గా ఈ సినిమా నిలిచి 1100 కోట్లు కొల్లగొట్టింది.ఈ సినిమాతో హిట్ కొట్టిన రామ్ చరణ్ అదే జోష్ లో మరో అగ్ర డైరెక్టర్ శంకర్ తో సినిమా స్టార్ట్ చేసాడు.

ఇండియన్ అగ్ర దర్శకులు అయినా రాజమౌళి, శంకర్ లతో ఈయన బ్యాక్ టు బ్యాక్ పని చేస్తూ రికార్డ్ క్రియేట్ చేసుకున్నాడు.ఇలా ఇప్పుడు ఉన్న స్టార్ దర్శకులిద్దరితో పని చేసిన ఘనత ఈయనకే సొంతం.

కాగా మెగా ఫ్యాన్స్ అంతా ఆర్సీ 15 సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు.ఇటీవలే అమృత్ సర్ లో, ఆపై వైజాగ్ లో ఈ సినిమా షూటింగ్ ముగించుకుంది.

ఇక త్వరలోనే కొత్త షెడ్యూల్ స్టార్ట్ కాబోతుంది.మరి ఈ సినిమాపై పెరుగుతున్న క్రేజ్ దృష్టిలో పెట్టుకుని శంకర్ కూడా కీలక జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.

అలాగే రామ్ చరణ్ లుక్ లో కూడా విభిన్నంగా చూపించ నున్నట్టు తెలుస్తుంది.రామ చరణ్ ను ఈ సినిమాలో శంకర్ ఎవ్వరూ ఊహించని లుక్స్ లో చూపించి మెగా ప్రేక్షకులను మెస్మరైజ్ చేయబోతున్నట్టుగా హింట్స్ వస్తున్నాయి.

తాజాగా చరణ్ స్టన్నింగ్ లుక్ ఒకటి వైరల్ అవుతుంది.ఈ లుక్ ను చరణ్ పర్సనల్ స్టైలిష్ అలీమ్ హకీమ్ చిన్న గ్లిమ్స్ లా రివీల్ చేసాడు.ఈ లుక్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అవుతుంది.ఈ లుక్ లో చరణ్ స్టైల్ సూపర్ హ్యాండ్సమ్ గా కనిపిస్తూ మెగా ఫ్యాన్స్ ను ఖుషీ చేస్తున్నాడు.

ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ కు జోడీగా కియారా అద్వానీ నటిస్తుండగా.దిల్ రాజు భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.ఈ సినిమాలో కీలక పాత్రల్లో సునీల్, అంజలి వంటి వారు నటిస్తున్నారు.అలాగే మ్యూజిక్ డైరెక్టర్ గా ఎస్ ఎస్ థమన్ ను తీసుకున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube