పవన్ ని నమ్ముకుంటే లాభం లేదని హరీష్ శంకర్ అలా చేస్తున్నాడా..!

గద్దలకొండ గణేష్ సినిమా తర్వాత గ్యాప్ తీసుకున్న డైరక్టర్ హరీష్ శంకర్ తన నెక్స్ట్ సినిమా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఫిక్స్ చేసుకున్నాడు.గబ్బర్ సింగ్ తర్వాత పవన్ తో చేస్తున్న సినిమాగా ఈ ప్రాజెక్ట్ పై క్రేజ్ ఏర్పడింది.

 Harish Shankar Another Movie Before Pawan Kalyan ,  Bhavadeeyudu Bhagath Singh ,-TeluguStop.com

భవదీయుడు భగత్ సింగ్ టైటిల్ తో వస్తున్న ఈ కాంబో సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి.మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లేందుకు ఇంకా టైం తీసుకునేలా ఉంది.

ప్రస్తుతం హరి హర వీరమల్లు సినిమా చేస్తున్న పవన్ కళ్యాణ్ ఆ తర్వాత వినోదయ సీతం సినిమా రీమేక్ ని చేస్తున్నాడు.

ఈ సినిమా తర్వాత భవదీయుడు భగత్ సింగ్ సినిమా చేస్తాడని తెలుస్తుంది.

పవన్ ఈ నిర్ణయం తీసుకోవడంతో తన సినిమా ఇంకా లేట్ అవుతుందని గుర్తించిన హరీష్ శంకర్ పవన్ సినిమా కన్నా ముందు మరో సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాడు.ప్రస్తుతం హరీష్ శంకర్ వేరే కథ సిద్ధం చేస్తున్నాడట.

అది పూర్తి కాగానే దానికి సూట్ అయ్యే హీరోతో సినిమా చేస్తాడని తెలుస్తుంది. పవన్ సినిమాకు ముందే మరో సినిమా చేసి సత్తా చాటాలని చూస్తున్నాడు హరీష్ శంకర్.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube