మెగాస్టార్ చిరంజీవి మెహర్ రమేష్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా భోళా శంకర్.ఈ సినిమాలో తమన్నా ఫీమేల్ లీడ్ గా నటిస్తుండగా మహానటి కీర్తి సురేష్ చిరంజీవికి సిస్టర్ రోల్ లో నటిస్తుంది.
తమిళంలో సూపర్ హిట్టైన వేదాళం రీమేక్ గా భోళా శంకర్ మూవీ తెరకెక్కుతుంది.ఆచార్య రిలీజ్ తర్వాత కొద్దిరోజులు హాలీడేస్ కు వెళ్లొచ్చిన చిరంజీవి మంగళవారం నుంచి భోళా శంకర్ షూటింగ్ షురూ చేస్తున్నారు.
రేపటి నుంచి జరుగబోయే షెడ్యూల్ లో యాక్షన్ ఎపిసోడ్స్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది.
రామ్ లక్ష్మణ్ మాస్టర్ యాక్షన్ డైరక్షన్ లో భోళా శంకర్ ఫైట్స్ జరుగనున్నాయట.
ఈ యాక్షన్ సీన్స్ చాలా స్టైలిష్ గా ప్లాన్ చేస్తున్నారట.మెగా ఫ్యాన్స్ కోరుకునే అంశాలతో భోళా శంకర్ ప్లాన్ చేస్తున్నారట.
ఆచార్యతో నిరుత్సాహపడ్డ మెగా ఫ్యాన్స్ భోళా శంకర్ విషయంలో మాత్రం సంతృప్తి చెందేలా మెహర్ రమేష్ ప్లాన్ చేస్తున్నారట.తప్పకుండా మెగా ఫ్యాన్స్ కి భోళా శంకర్ స్పెషల్ ట్రీట్ ఇస్తుందని అంటున్నారు.
మెగాస్టార్ ఇచ్చిన ఛాన్స్ ని మెహర్ రమేష్ ఏ విధంగా వాడుకుంటారో చూడాలి.