ప్రభాస్ నో చెబితే చరణ్ యస్ చెప్పాడా.. చిరంజీవి ఎంట్రీ వల్లే అంటూ?

ప్రస్తుతం సౌత్ ఇండియాలోని టాప్5 డైరెక్టర్ల జాబితాను పరిశీలిస్తే ఆ జాబితాలో లోకేశ్ కనకరాజ్ కూడా ఉంటారనే సంగతి తెలిసిందే.విక్రమ్ సినిమా సక్సెస్ తో లోకేష్ కనకరాజ్ ఇతర రాష్ట్రాల ప్రేక్షకుల దృష్టిని సైతం ఆకర్షించారు.

 Interesting Facts About Charan Lokesh Kanakaraj Combination Movie Details Here C-TeluguStop.com

అయితే కొన్నిరోజుల క్రితం ప్రభాస్ కు లోకేశ్ కనకరాజ్ ఒక కథను చెప్పాడని ఆ కథను రిజెక్ట్ చేశాడని వార్తలు వచ్చాయి.అయితే అదే కథతో చరణ్ లోకేశ్ కాంబోలో సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది.

చిరంజీవి లోకేశ్ కనకరాజ్ చెప్పిన కథను విని కథలో మార్పులు సూచించారని సమాచారం అందుతోంది.అయితే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

చరణ్ ఇప్పటికే శంకర్ డైరెక్షన్ లో ఒక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే సంగతి తెలిసిందే.చరణ్ లోకేశ్ కాంబినేషన్ లో కూడా సినిమా అధికారికంగా ఫిక్స్ అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించడం గ్యారంటీ అని చెప్పవచ్చు.

Telugu Chiran Jeevi, Chran, Kiyara Adavni, Prabhas, Shanker, Tollywood-Movie

అయితే ఈ కాంబినేషన్ లో సినిమా ఫిక్స్ అయినా ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లాలంటే మాత్రం చాలా సమయం పట్టే అవకాశాలు అయితే ఉన్నాయి.ఆచార్య ఫ్లాప్ తర్వాత చరణ్ ప్రాజెక్ట్ ల ఎంపిక విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.చరణ్ ఒక్కో సినిమాకు 60 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ ను తీసుకుంటున్నారని సమాచారం అందుతోంది.ఆర్ఆర్ఆర్ సక్సెస్ తో చరణ్ రెమ్యునరేషన్ పెరిగింది.శంకర్ చరణ్ కాంబో మూవీ షూట్ శరవేగంగా జరుగుతోంది.దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఈ సినిమా షూట్ జరుగుతుండగా ఈ సినిమాకు సర్కారోడు, అధికారి అనే టైటిల్స్ ను పరిశీలిస్తున్నారు.

ఈ రెండు టైటిల్స్ లో ఒక టైటిల్ ను ఫిక్స్ చేసి త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు.చరణ్ కు జోడీగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ ఈ సినిమాలో నటిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube