అమెరికాలో వింతజీవి సంచారం.. హడలి పోతున్న ప్రజలు

టెక్నాలజీ వినియోగంలో అగ్ర రాజ్యం అమెరికా అన్ని దేశాల కంటే ముందంజలో ఉంది.అంతరిక్ష పరిశోధనలో ఎవరికీ అందనంత ఎత్తుకు చేరుకుంది.

 Strange Creature In America , America, Viral Latest, News Viral Social Media,-TeluguStop.com

అలాంటి దేశంలో ఓ ఏలియన్‌ను పోలిన వింత జీవి సంచారం అక్కడి ప్రజలకు నిద్ర లేకుండా చేస్తోంది.టెక్సాస్‌లోని జంతుప్రదర్శనశాల వెలుపల దాగి ఉన్న వింత అనిశ్చిత జీవి చిత్రం వైరల్‌గా మారింది.

ఇంటర్నెట్‌ను ఊపేస్తోంది.సమీపంలోని సీసీ కెమెరా ద్వారా ఈ వింత జీవి చిత్రాలు బయటకు వచ్చాయి.

జూలో ఆ జీవి తిరుగుతున్నట్లు కనపడింది.దానికి రెండు చెవులు ఉన్నాయని, రెండు కాళ్లతో నడుస్తోందని వీడియో చూసిన వారికి తెలుస్తోంది.

టెక్సాస్‌లోని అమరిల్లో నగరానికి చెందిన ఫేస్‌బుక్ ఖాతాలో ఈ వింత జీవికి సంబంధించిన ఫొటో పోస్ట్ చేశారు.మే 21న తెల్లవారుజామున జూ వెలుపల ఒక వింత జీవి సంచరించింది.

అదేమిటో తెలిస్తే చెప్పాలని కోరింది.ఈ సమయంలో ఎటువంటి వ్యక్తులు లేదా జంతువులకు హాని జరగలేదని పార్క్ డైరెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు.

బలవంతంగా ప్రవేశించిన సంకేతాలు లేదా ఏ విధమైన నేర కార్యకలాపాలు కూడా లేవని తేలింది.సెక్యూరిటీ కెమెరా ఫుటేజీ ప్రకారం, చిత్రం మే 21, తెల్లవారుజామున 1:30 గంటల ప్రాంతంలో అది సంచరించిందని తెలిసింది.జూ అధికారులు ఈ సంఘటనపై ప్రజల అభిప్రాయాన్ని కోరారు.ఏదైనా తెలిస్తే మెయిల్ చేయాలని కోరారు.ఏదేమైనా ఈ చిత్రం బయటకు రాగానే అది ఏలియన్ అయి ఉంటుందనే ఊహాగానాలు చుట్టు ముట్టాయి.ప్రపంచ వ్యాప్తంగా ఈ విషయం బాగా వైరల్ అయింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube