అమెరికాలో వింతజీవి సంచారం.. హడలి పోతున్న ప్రజలు
TeluguStop.com
టెక్నాలజీ వినియోగంలో అగ్ర రాజ్యం అమెరికా అన్ని దేశాల కంటే ముందంజలో ఉంది.
అంతరిక్ష పరిశోధనలో ఎవరికీ అందనంత ఎత్తుకు చేరుకుంది.అలాంటి దేశంలో ఓ ఏలియన్‌ను పోలిన వింత జీవి సంచారం అక్కడి ప్రజలకు నిద్ర లేకుండా చేస్తోంది.
టెక్సాస్‌లోని జంతుప్రదర్శనశాల వెలుపల దాగి ఉన్న వింత అనిశ్చిత జీవి చిత్రం వైరల్‌గా మారింది.
ఇంటర్నెట్‌ను ఊపేస్తోంది.సమీపంలోని సీసీ కెమెరా ద్వారా ఈ వింత జీవి చిత్రాలు బయటకు వచ్చాయి.
జూలో ఆ జీవి తిరుగుతున్నట్లు కనపడింది.దానికి రెండు చెవులు ఉన్నాయని, రెండు కాళ్లతో నడుస్తోందని వీడియో చూసిన వారికి తెలుస్తోంది.
టెక్సాస్‌లోని అమరిల్లో నగరానికి చెందిన ఫేస్‌బుక్ ఖాతాలో ఈ వింత జీవికి సంబంధించిన ఫొటో పోస్ట్ చేశారు.
మే 21న తెల్లవారుజామున జూ వెలుపల ఒక వింత జీవి సంచరించింది.అదేమిటో తెలిస్తే చెప్పాలని కోరింది.
ఈ సమయంలో ఎటువంటి వ్యక్తులు లేదా జంతువులకు హాని జరగలేదని పార్క్ డైరెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు.
బలవంతంగా ప్రవేశించిన సంకేతాలు లేదా ఏ విధమైన నేర కార్యకలాపాలు కూడా లేవని తేలింది.
సెక్యూరిటీ కెమెరా ఫుటేజీ ప్రకారం, చిత్రం మే 21, తెల్లవారుజామున 1:30 గంటల ప్రాంతంలో అది సంచరించిందని తెలిసింది.
జూ అధికారులు ఈ సంఘటనపై ప్రజల అభిప్రాయాన్ని కోరారు.ఏదైనా తెలిస్తే మెయిల్ చేయాలని కోరారు.
ఏదేమైనా ఈ చిత్రం బయటకు రాగానే అది ఏలియన్ అయి ఉంటుందనే ఊహాగానాలు చుట్టు ముట్టాయి.
ప్రపంచ వ్యాప్తంగా ఈ విషయం బాగా వైరల్ అయింది.
అనిల్ రావిపూడి కెరియర్ లో సంక్రాంతికి వస్తున్నాం బిగ్గెస్ట్ హిట్ గా మారబోతుందా..?