తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో నయనతార అంటే తెలియని వారు ఉండరంటే పెద్ద అతిసయోక్తి కాదేమో.అంతగా ఈ బ్యూటీ ప్రేక్షకులకు దగ్గర అయ్యింది.
హీరోలకు ధీటుగా స్టార్ స్టేటస్ సంపాదించుకున్న ఈ బ్యూటీ ప్రెసెంట్ వరుస లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ దూసుకు పోతుంది.లేడీ సూపర్ స్టార్ నయనతార యంగ్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ ప్రేమించుకున్న విషయం తెలిసిందే.
మరి ఎట్టకేలకు నయనతార, విఘ్నేష్ శివన్ జంట పెళ్లితో ఒక్కటయ్యారు.వీరి పెళ్ళికి సంబంధించిన పెళ్లి ఫోటలు నెట్టింట ఓ రేంజ్ లో వైరల్ అయ్యాయి.వీరి జంటను ఆశీర్వదించేందుకు అన్ని ఇండస్ట్రీల ప్రముఖులు, బంధు మిత్రులు హాజరయ్యారు.వీరందరి మధ్య నయనతార కు విఘ్నేష్ చాలా సంతోషంగా తాళి కట్టి ఆమెను తనదానిని చేసుకున్నాడు.
వీరి పెళ్లి తర్వాత చాలా విషయాలు నెట్టింట వైరల్ అవుతూనే ఉన్నాయి.
వీటిలో ఎన్ని విషయాలు నిజం? ఎన్ని అబద్ధం అనే విషయం తెలియదు కానీ రోజుకొక వార్త మాత్రం నెట్టింట వైరల్ అవుతూనే ఉంది.
నయనతార, విఘ్నేష్ ఒకరికొకరు చాలా ఖరీదైన బహుమతులు ఇచ్చుకున్నారని వార్తలు వచ్చాయి.నయనతార 20 కోట్ల విలువైన బంగ్లా ను తన భర్తకు గిఫ్ట్ గా ఇస్తే.విఘ్నేష్ నయనతార కు కోట్ల రూపాయల బంగారు ఆభరణాలు ఇచ్చాడట.వాటి విలువ నాలుగు కోట్ల వరకు ఉంటుందని టాక్ బయటకు వచ్చింది.
అయితే వివాహం అయినా సందర్భంగా నయన్ విఘ్నేష్ చెల్లెలు ఐశ్వర్య కు ఏకంగా 15 లక్షల విలువ చేసే 30 పీస్ బంగారు నగలను కానుకగా ఇచ్చారట.నయన్ ఈ రేంజ్ లో ఆడపడుచు కట్నం ఇవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.ఆడపడుచుకు 15 లక్షల విలువ చేసే బంగారం కొనివ్వడంతో ఈ విషయం కోలీవుడ్ మీడియాలో ఇప్పుడు హాట్ టాపిక్ గా చర్చించు కుంటున్నారు.