బిగ్‌ బాస్‌ కామన్‌ మాన్‌ సెలక్షన్స్‌ కోసం వీజే సన్నీ వన్ వీక్‌ షో

తెలుగు బిగ్‌ బాస్ సీజన్‌ 6 కు సంబంధించిన ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి.సామాన్యులకు ఈసారి హౌస్‌ లోకి అవకాశం ఇస్తున్నారు.

 Telugu Biggbos Season 6 News Biggbos Season , Biggbos Season 6 , Telugu Biggbo-TeluguStop.com

గతంలో మాదిరిగా ఈసారి ముగ్గురు లేదా అంతకు మించి అన్నట్లుగా హౌస్ లో అడుగు పెట్టబోతున్నారు.సామాన్యులకు అవకాశం అనగానే లక్షల్లో అప్లికేషన్స్ వచ్చాయి.

వాటిల్లోంచి వందల్లో అప్లికేషన్స్ గా కుదించి ఆటిల్లోంచి కూడా కొన్నింటిని ఫైనల్‌ చేసి వారికి ఒక వీక్ పరీక్ష పెట్టబోతున్నారు.ఆ పరీక్ష లో ఏ ముగ్గురు అయితే విన్ అవుతారో వారికి బిగ్‌ బాస్ సీజన్ 6 లో అవకాశం ఉంటుంది అంటూ వార్తలు వస్తున్నాయి.ఇప్పటికే అందుకు సంబంధించిన ఏర్పాట్లు ప్రారంభం అయ్యాయి.ఆ గ్రేడింగ్‌ కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి వీజే సన్నీ హోస్టింగ్‌ చేయబోతున్నాడు.

సామాన్యులకు ఛాన్స్ అంటూ వీజే సన్నీ నిర్వహించబోతున్న ఈ కార్యక్రమం కు సంబంధించిన షూటింగ్‌ త్వరలోనే ప్రారంభం కాబోతుందట.బిగ్‌ బాస్‌ సీజన్‌ 6 ప్రారంభం అవ్వడానికి వారం ముందు ఈ ఎంపిక పక్రియ టెలికాస్ట్‌ చేస్తారు.

ఫైనల్‌ లో ఎవరు ఉంటారు అనే విషయం ను బిగ్‌ బాస్‌ సీజన్ 6 ప్రారంభం అయిన రోజు ప్రకటించనున్నారు.అంటే బిగ్‌ బాస్ వారం ముందుగానే ప్రారంభం అవ్వబోతుంది… అది కూడా వీజే సన్నీ హోస్టింగ్‌ తో అంటూ స్టార్‌ మా వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

అదుగో ఇదుగో అంటూ బిగ్ బాస్ గురించి రక రకాలుగా పుకార్లు షికార్లు అయితే చేస్తున్నాయి.ఈ సీజన్ కు కూడా నాగార్జున హోస్ట్‌ అని ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది.

కనుక కంటెస్టెంట్స్ ఎవరు ఉంటారా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.బిగ్‌ బాస్‌ సీజన్ 6 ను జులై లేదా ఆగస్టు లో మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయి.

అధికారిక ప్రకటన ఈ నెల చివరి వరకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube