తెలుగు సినీ ప్రేక్షకులకు అగ్ర హీరో అయిన సూపర్ స్టార్ కృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఒకప్పుడు తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరో గా ఒక వెలుగు వెలిగిన కృష్ణ ప్రస్తుతం వయసు మీద పడటంతో ఇంట్లో ఉంటూ రెస్ట్ తీసుకుంటున్న విషయం తెలిసిందే.
ఇక అప్పట్లో సూపర్ స్టార్ కృష్ణ నటించిన ప్రతి ఒక్క సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచాయి.అంతేకాకుండా బాక్సాఫీస్ వద్ద సరికొత్త ట్రెండ్ ను సెట్ చేశాయి.
ఇకపోతే సూపర్ స్టార్ కృష్ణకు మొత్తం ఐదు మంది పిల్లలు కాగా అందులో రమేష్ బాబు పెద్ద కుమారుడు, ఆ తరువాత పద్మావతి ఘట్టమనేని వంశంలో పెద్దకుమార్తె.రెండవ కూతురు మంజుల ఘట్టమనేని అనంతరం మహేష్ బాబు ఇంట్లో నాలుగవ తనయుడు.
అందరికంటే చిన్న కూతురు ప్రియదర్శిని ఆమె హీరో సుధీర్ బాబు ను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి కేవలం మహేష్ బాబు మాత్రమే కాకుండా పెద్ద కుమారుడు రమేష్ బాబు కూడా కొన్నాళ్లు చిత్రపరిశ్రమలో కొనసాగిన విషయం తెలిసిందే.
అయితే కృష్ణ గారి కుమార్తెలలో ఒకరిని హీరోయిన్ గా వెండితెరపై వెలగాలని చాలా కలలు కన్నారు క్రిష్ణ.అందుకోసం ప్రత్యేకంగా కొంతకాలం శిక్షణ కూడా తీసుకునే హీరోయిన్ గా సక్సెస్ అవ్వాలని గట్టిగానే ప్రయత్నాలు కూడా జరిగాయి.
మంజుల సినిమా పరిశ్రమలో కొనసాగాలని యంగ్ ఏజ్ లో చాలా ప్రయత్నాలు చేసిందట.
మొదట సూపర్ స్టార్ కృష్ణని అడిగినప్పుడు ఆయన వద్దని ఆ తరువాత గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట.అప్పుడు హీరో బాలకృష్ణ ఏ మాత్రం ఆలోచించకుండా నందమూరి బాలకృష్ణ కడా తన సినిమాలో హీరోయిన్ గా సెలెక్ట్ చేసుకోవడానికి సిద్ధమయ్యారు.
ఎస్వీ కృష్ణారెడ్డి
దర్శకత్వం లో 1994లో బాలకృష్ణ టాప్ హీరో సినిమా కోసం మంజుల ఘట్టమనేని పెద్దగా ఆలోచించకుండానే ఓకే చేసేశారు సినిమాలు కూడా అయిపోయింది అనుకున్న క్రమంలో ఘట్టమనేని అభిమానులు ఒక్కసారిగా తిరగబడ్డారు.సూపర్ స్టార్ కృష్ణ కూతురు అంటే మాకు సోదరి లాంటివారు అని హీరోయిన్గా చేయడానికి వీలు లేదు అనే ఎస్.
వి.కృష్ణారెడ్డి కటౌట్ లను కూడా చింపేసి నానా గొడవ చేశారు.దీనితో కృష్ణ తన కూతుళ్ళను హీరోయిన్ లుగా చూడాలి అన్న కల కలగానే మిగిలిపోయింది.