నందమూరి బాలకృష్ణ ఇటీవలే అఖండ సినిమా తో సూపర్ డూపర్ సక్సెస్ ను దక్కించుకున్నాడు.దాదాపు గా రెండు వందల కోట్ల వసూళ్ల ను అఖండ సినిమా రాబట్టిన విషయం తెల్సిందే.
భారీ ఎత్తున విజయం సాధించిన అఖండ సినిమా తర్వాత బాలయ్య బ్యాక్ టు బ్యాక్ గోపీచంద్ మలినేని మరియు అనీల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా లను చేస్తున్నాడు.చేయబోతున్నాడు.
ఇప్పటికే గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమాను బాలయ్య దాదాపు గా ముగించాడు.
బాలయ్య 107వ సినిమా గా రూపొందుతున్న ఈ సినిమాకు పలు టైటిల్స్ ను పరిశీలించారు.
చివరకు జై బాలయ్య అనే టైటిల్ ను కన్ఫర్మ్ చేశారు అంటూ వార్తలు వచ్చాయి.కాని తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం జై బాలయ్య టైటిల్ విషయంలో ఒకింత వెనకడుగు వేశారట.
అందుకే మొన్న ఎన్టీఆర్ 100వ జయంతి సందర్బంగా బాలయ్య సినిమా యొక్క ఫస్ట్ లుక్ విడుదల అవ్వాల్సి ఉన్నా కూడా టైటిల్ ను ఖరారు చేయక పోవడం తో 107వ సినిమా అంటూ కేవలం ఒక స్టిల్ ను మాత్రమే విడుదల చేయడం జరిగింది.

బాలయ్య సినిమా టైటిల్ విషయంలో ఎప్పుడు కూడా ఈ స్థాయిలో చర్చ జరగలేదు.జై బాలయ్య దాదాపు గా కన్ఫర్మ్ అనుకుని మళ్లీ ఎందుకు వెనకడుగు వేశారు అంటూ కొందరు ప్రశ్నిస్తూ ఉంటే.కొందరు మాత్రం జై బాలయ్య సినిమా టైటిల్ విషయంలో ఇంకాస్త క్లారిటీ ఇవ్వాలంటూ విజ్ఞప్తి చేస్తున్నారు.
మరో నెల రోజుల్లో గోపీచంద్ మలినేని సినిమాను ముగించబోతున్నాడు.ఆ వెంటనే అనీల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య సినిమా ను మొదలు పెట్టబోతున్నారు.
బాలయ్య.అనీల్ రావిపూడి కాంబో మూవీ పక్కా కమర్షియల్ మాస్ ఎంటర్ టైనర్ గా ఉంటుందంటూ చెబుతున్నారు.