సంక్రాంతి వచ్చిందంటే సందడి ఏ రేంజ్లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.కేవలం ఊరువాడ మాత్రమే కాదు అటు థియేటర్ల వద్ద స్టార్ హీరోల సినిమాల సందడి అదే రేంజ్ లో ఉంటుంది.
సంక్రాంతికీ సినిమాతో థియేటర్లలో బరిలోకి దిగి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని ప్రతి ఒక్కరు భావిస్తూ ఉంటారు.ఇక ఎంత పోటీ ఉన్నప్పటికీ సంక్రాంతి బరిలో నిలిస్తే సూపర్ డూపర్ హిట్ అవ్వడం ఖాయం అని భావిస్తూ ఉంటారు.
అయితే ఇక ఇప్పుడు సంక్రాంతి బరిలో దిగేందుకు సిద్ధమవుతున్నారు స్టార్ హీరోలు.సంక్రాంతి ఇంకా ఎనిమిది నెలల సమయం ఉన్నప్పటికీ కూడా ఇక ఎంతో ముందుగానే తమ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటిస్తున్నారు.
మరి సంక్రాంతి పండక్కి బాక్సాఫీస్ వద్ద కర్చీఫ్ వేసిన హీరోలు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న భారీ బడ్జెట్ మూవీ ఆదిపురుషుష్ సంక్రాంతికి రిలీజ్ చేసేందుకు సిద్ధమయ్యారు.
ఈ సినిమాలో కృతి సనన్, సైఫ్ అలీఖాన్ కీలక పాత్రలో నటిస్తున్నారు.ప్రభాస్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది.ఇక అదే సమయంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న హిస్టరికల్ యాక్షన్ డ్రామా హరిహర వీరమల్లు ని కూడా సంక్రాంతి బరిలో దింపేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.కాగా క్రిష్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.
నిధి అగర్వాల్ పవన్ సరసన నటిస్తోంది.
టాలీవుడ్ దర్శకుడు వంశీ పైడిపల్లి కోలీవుడ్ ఇళయదళపతి విజయ్ కాంబోలో రూపొందుతున్న సినిమాను కూడా సంక్రాంతికి తీసుకురావాలని అనుకుంటున్నారట.దిల్ రాజు బ్యానర్ లో సినిమా తెరకెక్కుతుంది.అయితే చరణ్ శంకర్ కాంబినేషన్ లో సినిమాను సమ్మర్ కి పోస్ట్ చేయడంతో ఇక ఈ సినిమాను బరిలోకి దింపాలని అనుకుంటున్నారట.
మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న బోలా శంకర్ సినిమా లేదా వాల్తేరు వీరయ్య సినిమాలలో ఒకటి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనుకుంటున్నారట.ఇక మరోవైపు విజయ్ దేవరకొండ సమంత కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాను కూడా సంక్రాంతి రేసులోకి తీసుకోవాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది.
సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమాని కూడా జూనియర్ షూటింగ్ ప్రారంభించి సంక్రాంతి వరకు ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనుకుంటున్నారట.దీంతో ఈ సంక్రాంతి బరిలో ఎవరు నిలిచి గెలుస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది.