వైరల్ వీడియో: గ్రౌండ్ లోనే కాదు.. బయట కూడా అదరగొడుతున్న బట్లర్..!

IPL (ఇండియన్ ప్రీమియర్ లీగ్) తాజా సీజన్ లో రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్ అయినటువంటి జాస్ బట్లర్ మంచి స్పీడుతో దూసుకుపోతున్న సంగతి అందరికీ విదితమే.ఈ సీజన్ ఆరంభం నుంచి కూడా అద్భుత ఆట తీరుతో ముందుకు వెళుతూ ఆరెంజ్ క్యాప్ లిస్ట్ లో మొదటి స్థానం చేజిక్కించుకున్నాడు.

 Chahal And Buttler Dancing To Balle Ni Balle Song Viral Video Details,  Viral La-TeluguStop.com

ఇప్పటి వరకు 10 మ్యాచ్ లు ఆడిన అతడు 588 పరుగులు చేసి, బౌలింగ్ లో 10 మ్యాచ్ ల్లో 19 వికెట్లు తీసి, ఆ జట్టు లెగ్ స్పిన్నర్ అయినటువంటి యుజువేంద్ర చహల్ పర్పుల్ క్యాప్ రేసులో ముందున్నాడు.మరోవైపు అటు బ్యాటింగ్ ఇటు బౌలింగ్ లో కూడా పటిష్టంగా ఉన్న రాజస్తాన్ రాయల్స్ కూడా ప్లే ఆఫ్స్ పై ఓ కన్నేసింది.

అయితే, జరిగిన 2 మ్యాచ్ ల్లో కూడా ఆ జట్టు ఊహించని రీతిలో అపజయం పాలయ్యింది.ఇక తాజాగా గ్రౌండ్ లో ఓ గమ్మత్తైన సీన్ చోటుచేసుకుంది.

జాస్ బట్లర్ చేత ఆ జట్టు లెగ్ స్పిన్నర్ యుజువేంద్ర చహల్ అదిరిపోయే స్టెప్పులు వేయించి, నవ్వులు పూయించారు.అలా ఈ ఇద్దరు కలిసి ‘డ్యాన్సింగ్ టు బల్లే ని బల్లే’ పాటకు అదిరిపోయే స్టెప్పులు వేసి, ఔరా అనిపించారు.

బట్లర్‌ స్లో మూమెంట్స్‌తో అందంగా డాన్స్ చేయగా, చహల్‌ మాత్రం​ మాస్‌ డ్యాన్స్‌తో దుమ్ముదులిపేశాడు.దీనికి సంబంధించిన వీడియోను రాజస్తాన్ రాయల్స్ తమ ట్విట్టర్ ఖాతాలో పెట్టింది.

ఇక సదరు వీడియోను చూసిన ఫ్యాన్స్ బట్లర్ గ్రేస్ కు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.ఇంతకీ ఈ పాటకు కొరియోగాఫ్రర్‌ ఎవరో తెలుసా.చహల్‌ భార్య అయినటువంటి యూట్యూబర్‌ ‘ధనశ్రీ వర్మ’. ‘నా మోస్ట్ ఫెవరెట్ రీల్… మై ఫెవరెట్స్… లవ్’ అంటూ ధనశ్రీ కామెంట్ చేయడం మనం అక్కడ చూడవచ్చు.

ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది.వీలైతే మీరు కూడా ఓ లుక్కేయండి.ఇప్పటివరకు 10 మ్యాచుల్లో 6 మ్యాచెస్ గెలుచుకున్న రాజస్థాన్ రాయల్స్, మిగిలిన 4 మ్యాచుల్లో కనీసం 2 మ్యాచెస్ గెలివాల్సిన అవసరం వుంది.లేదంటే రాజస్తాన్ కథ కంచికే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube