మహేష్ ఫ్యాన్స్ లో కొత్త టెన్షన్... సీఎం జగన్ ను కలిసిన హీరోల సినిమాలు ప్లాప్ ?

ఇండస్ట్రీలో ఇపుడు మరో కొత్త వార్త సంచలనంగా మారింది.అందులోనూ ఆ న్యూస్ ను పాలిటిక్స్ కు ముడిపెట్టడంతో టాపిక్ ఇంట్రెస్టింగ్ గానే కాదు, షాకింగ్ గా కూడా ఉంది.

 New Tension In Tollywood Heros Who Met With Jagan, Jagan, Ap Cm, Chiranjeevi , M-TeluguStop.com

ఇంతకీ ఆ సెన్సేషనల్ న్యూస్ గురించి వింటే మీరు కూడా ఆశ్చర్య పోవాల్సిందే.ఇటీవల ఏపీకి మరియు టాలీవుడ్ ఇండస్ట్రీకి మద్య టికెట్ల వివాదం ఏ రేంజ్ లో సాగింది అన్నది తెలిసిందే.

టికెట్ల రేట్ల పెంపుపై ప్రభుత్వం సుముఖంగా లేకపోగా ఆంక్షలు విధించడంతో అటు ఇండస్ట్రీకి ఇటు ఏపీ ప్రభుత్వానికి మధ్య మిని యుద్దమే జరిగింది.టాలీవుడ్ ప్రముఖులంతా కలిసి ఏపి సర్కారు పై విమర్శలు కురిపించారు, ఆ తరువాత అర్ధం చేసుకోవాలి అంటూ వ్యాఖ్యలు చేశారు, ఇక లాభం లేదు అనుకుని వరుసగా సినీ పెద్దలు అంతా నేరుగా ఏపీ సిఎం జగన్ ను కలిసి చర్చలు జరపడంతో చివరకు ప్రభుత్వం ఒక మెట్టు దిగి వచ్చి టికెట్ల రేట్ల పెంపుకు ఆమోదం తెలిపింది.

అయితే ఇందుకు మొదట పీఠం వేసింది మాత్రం సినీ ముద్దుబిడ్డ మెగాస్టార్ చిరంజీవి అనే చెప్పాలి.ఈయన మొదట తన సతీమణితో కలిసి జగన్ ను కలిసి సినిమా టికెట్ల విషయం గురించి చర్చించారు.

ఆ తరువాత కొందరు సినీ పెద్దలతో పాటు కలిసి వెళ్లి సిఎం జగన్ తో చర్చలు జరిపి చివరికి సరే అనిపించారు.అయితే ఇపుడు ఆ మ్యాటర్ కాస్త హైలెట్ అయ్యింది.

అప్పుడు సిఎం జగన్ ను కలిసిన హీరోలందరూ కూడా ఇపుడు వరుసగా ఫ్లాప్ లు అందుకుంటున్నారు అన్న ప్రచారం మొదలయ్యింది.కానీ విషయం చూస్తుంటే నిజమే అనిపిస్తోంది.

అప్పట్లో టికెట్ల విషయంలో సీఎం జగన్ మోహన్ రెడ్డిని కలవడానికి మెగాస్టార్ చిరంజీవి, ప్రభాస్ , మహేష్ బాబు, దర్శకుడు రాజమౌళి మరియు సినీ ప్రముఖులు లు వెళ్ళారు.కాగా ఇక్కడ ముఖ్యమంత్రి జగన్ ను కలిసిన హీరోల సినిమాలు ఫ్లాప్ అయ్యాయని ఇక మహేష్ ఒక్కరే మిగిలారు అని ఆయన పరిస్థితి ఏంటి…?? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

Telugu Acharya, Ap Cm, Chiranjeevi, Jagan, Mahesh Babu, Prabhas, Tollywood Heros

సిఎం జగన్ ను కలిసిన ప్రభాస్ నుండి వచ్చిన చిత్రం రాధేశ్యామ్ అయితే ఈ సినిమా అంచనాలను తారుమారు చేస్తూ నిరాశను మిగిలిచింది.ఇక ఆ తరువాత హీరో విషయానికి వస్తే సీఎం జగన్ ను కలిశాక చిరు నుండి వచ్చిన మూవీ ఆచార్య రిలీజ్ కు ముందు ఫుల్ జోష్ తో ఎంతో హడావిడి చేసిన ఈ చిత్రం, రిలీజ్ అయ్యాక నెగిటివ్ టాక్ తో ఢీలా పడిపోయింది.ఇక ముచ్చటగా మూడో హీరో మహేష్ బాబు కూడా సిఎం ను కలిసిన హీరోలలో ఒకరు కాగా.అప్పటి నుండి ఆయన చిత్రాలు ఏమి కూడా రిలీజ్ కాలేదు… ఇపుడు త్వరలో మహేష్ తాజా చిత్రం సర్కారు వారి పాట మన ముందుకు రానుంది.

ఈ మూవీ కూడా ఇదే సెంటిమెంట్ సీక్వెల్ లో నిరాశను మిగిలుస్తుందా అన్న టాక్ మొదలయ్యింది.నెక్స్ట్ నువ్వే అన్నట్లుగా మహేష్ పేరు ఇపుడు ఇండస్ట్రీలో వినపడుతున్న నేపథ్యంలో సర్కారు వారి పాట సినిమా ఎలాంటి ఫలితం దక్కించుకుంటుంది అన్న విషయంపై ఉత్కంఠ నెలకొంది.

చూడాలి మరి ఏం జరుగుతుందో …

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube