ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి లో మోకాళ్ళ చిప్పల ఆపరేషన్లు చేపించుకున్న పేషెంట్లను పరామర్శించిన మంత్రి హరీష్ రావు.

జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి లో ఇటీవల మోకాళ్ళ చిప్పల ఆపరేషన్లు చేపించుకున్న పేషెంట్లను పరామర్శించిన మంత్రి హరీష్ రావు.ఈ సందర్భంగా మంత్రి హరిశ్ రావు గారు మాట్లాడుతూ గాంధీ, ఉస్మానియా ఆసుపత్రికి పరిమిత అయినా మోకాలి చిప్పలు మార్పిడి నీ త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆసుపత్రులలో ప్రారంభిస్తాము.

 Minister Harish Rao Visited The Patients Who Underwent Knee Surgery At The Gover-TeluguStop.com

ప్రతి వారం ఇద్దరికి సిద్దిపేట ఆసుపత్రిలో మోకాలి చిప్పలు మార్పిడి ఆపరేషన్ చేస్తాం ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లి డబ్బులు వృధా చేసుకోవద్దు.ప్రభుత్వ ఆసుపత్రిలపై రోగులకు భయం పోయి దైర్యం, నమ్మకం కలిగింది.

డబ్బులు ఉన్నవాళ్ళకి మాత్రమే చేసుకునే మోకాలి చిప్పలు మార్పిడి నేడు ప్రభుత్వ ఆసుపత్రిలో పేద వాళ్లకు కూడా అందుబాటులోకి తెచ్చాము.

సీఎం కేసీఆర్ ఆలోచనలు అమలు అవుతున్నాయ్ సీఎం కెసిఆర్ కలలు నేడు నిజమవుతున్నాయ్ఒకనాడు ప్రభుత్వ ఆసుపత్రిలో 30శాతం డెలివరీ లు అవుతే నేడు 56శాతం అవుతున్నాయి.

సీఎం కెసిఆర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ లు ఏర్పాటు చేయడం వల్లనే సర్జరీలు సాధ్యం అవుతున్నాయి,సుమారు ఈ సర్జరీ లకు 5లక్షల వరకు ఖర్చు అవుతుంది సర్జరీ చేయడం వల్ల వారికి పునర్ జన్మ ఇచ్చాం.మోకాళ్ల నొప్పులతో ప్రతి 10మందిలో ఇద్దరు బాధపడుతున్నారు ఈ ఆసుపత్రిలో వారానికి సుమారు 6గురికి మోకాళ్ల చిప్పలు మార్పిడి చేయాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube