వెన్నెల కిషోర్, నందితా శ్వేత, నవమి గాయక్, షకలక శంకర్, రజత్ రాఘవ్, నవిన్ నేని, రఘుబాబు తదితరులు కీలక పాత్రల్లో నటించిన తాజా చిత్రం ఓ మంచి ఘోస్ట్.( O Manchi Ghost ) ఈ సినిమాకు శంకర్ మార్తాండ్ దర్శకత్వం వహించారు.
మార్క్ సెట్ నెట్‌వర్క్స్ బ్యానర్ మీద డా.అబినికా ఇనాబతుని నిర్మించారు.
ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా నేడు అనగా జూన్ 21న విడుదలైంది.తాజాగా విడుదలైన ఈ సినిమా ఎలా ఉంది?ఈ సినిమా అసలు కథ ఏమిటి అన్న వివరాల్లోకి వెళితే.
కథ:
సినిమాలో ఊరికి చివర్లో ఒక మహాల్ ఉంటుంది.అందులో ఒక దయ్యం ఉంటుంది.
అయితే ఆ దయ్యానికి కిడ్నాప్ అనే పదం వింటే చాలు కోపంతో చెలరేగి పోయి అలా కిడ్నాప్ చేసే వాళ్ళము చంపేస్తూ ఉంటుంది.మరోవైపు చైతన్య, రజియా, లక్ష్మణ్, పావురం లాంటి వారందరు కూడా డబ్బు సమస్యతో ఒక చోటకు చేరుతారు.
వారు తమ బాధల నుంచి బయటకు రావాలంటే ఎమ్మెల్యే సదా శివ రావు కూతురు కీర్తి ను( Keerthy ) కిడ్నాప్ చేస్తారు.కీర్తిని కిడ్నాప్ చేసిన ఆ నలుగురు ఊరి చివరన ఉన్న మహల్‌కు వెళ్తారు.
అసలే అక్కడ కిడ్నాప్ అంటే పడని దెయ్యం ఉంటుంది.కీర్తికి కూడా ఒక సమస్య ఉంటుంది.
మరి అటు దెయ్యం కీర్తి మధ్యలో ఆ నలుగురు ఎలా నలిగిపోయారు? ఆ మహల్ కథ ఏంటి? ఈ దెయ్యాల గోల ఏంటి? నలుగురు బతికి బయటపడ్డారా లేదా అన్న విషయాలు తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే.
నటీనటులు :
వెన్నెల కిషోర్,( Vennela Kishore ) షకలక శంకర్( Shakalaka Shankar ) వారి కామెడీతో బాగానే నవ్వించారు.ఇది వరకే ఘోస్ట్ పాత్రలో అద్భుతంగా నటించిన నందితా శ్వేతా( Nandita Swetha ) ఈ సినిమాలో కూడా బాగా నటించింది.తన నటనతో అదరగొట్టేసింది.
నవమి గాయక్ గ్లామరస్‌గా అనిపిస్తుంది.రఘుబాబు కనిపించినంత సేపు కూడా ప్రేక్షకులు నవ్వుతూనే ఉంటారు.
నవీన్ నేని మధ్య మధ్యలో నవ్విస్తాడు.ఇక మిగిలిన నటీనటులు ఎవరి పాత్రల పరిధి మేరకు వారు బాగానే నటించారు.
విశ్లేషణ :
ఇక సినిమాలో కామెడీ ఎంతలా ఉందో హర్రర్( Horror ) కూడా అంతలా ఉందని చెప్పాలి.బాగా నవ్విస్తూనే బాగా భయపెడుతూ ఉంటారు.ఇప్పటికే హార్రర్ జోనర్ లో చాలా సినిమాలు వచ్చినప్పటికీ ఈ సినిమాను తెరకెక్కించిన విధానం చాలా బాగుంది.ఇకపోతే ఇందులో ఫస్ట్ హాఫ్‌లో ప్రారంభం కాస్త నెమ్మదిగా అనిపిస్తుంది.
ఒక్కసారి ఈ గ్యాంగ్ ఆ మహల్‌లో ఎంట్రీ ఇచ్చాక కథ మొత్తం మారుతుంది.అక్కడి నుంచి నవ్వుల పంట పండిచేస్తుంటారు.
ఇంటర్వెల్ కు ట్విస్ట్ అదిరిపోతుంది.ఇక సెకండాఫ్ లో దెయ్యాలతో చేసే కామెడీ హైలెట్ అని చెప్పాలి.
మధ్య మధ్యలో దెయ్యాలు కూడా కామెడీ చేస్తుంటాయి.సీరియస్‌గా భయపెడుతుంటాయి.
టెక్నికల్ :
సాంకేతిక పరంగా కూడా ఈ సినిమా బాగుంది.ఇక ఇందులో ఆర్ఆర్ అదిరిపోయింది.పాటలు కూడా మెప్పిస్తాయి.కెమెరా వర్క్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి.కెమెరా వర్క్‌తోనే భయపెట్టేశారు.ఆర్ట్ డిపార్ట్మెంట్ బాగానే పని చేసింది.
ఎడిటింగ్ బాగుంది.మాటలు నవ్విస్తాయి.పంచ్‌లు బాగానే పేలాయి.మొదటి సినిమానే దర్శకుడు ఎక్కడా తడబడలేదు.