అమెరికన్ రాజకీయాలలో ఇమ్మిగ్రేషన్ విధానాలు, వలసలు అంశానికి అత్యంత ప్రాధాన్యత ఉంది.ఎన్నికల టైంలో సరేసరి.
దేశంలో అత్యధిక మంది వలసదారులే కావడంతో వారే నిర్ణయాత్మక శక్తిగా అభ్యర్ధుల గెలుపొటములను నిర్దేశిస్తున్నారు.వారిని మచ్చిక చేసుకునేందుకు రాజకీయ పార్టీలు కిందా మీదా పడుతుంటాయి.
డెమొక్రాట్లు చూసీచూడనట్లుగా వదిలేస్తే.రిపబ్లికన్లు మాత్రం వలసల విషయంలో కఠినంగా ఉంటారు.
అన్నింటికి మించి మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్( Donald Trump ) ఈ విషయంలో ఖచ్చితంగా ఉంటారు.తాజా అధ్యక్ష ఎన్నికల్లోనూ తాను మరోసారి గెలిస్తే అమెరికా( America ) నుంచి అక్రమ వలసదారులను తరిమేస్తానని సంచలన ప్రకటన చేశారు ట్రంప్.
కానీ ఈసారి మాత్రం అందుకు భిన్నంగా మాట్లాడారు.అమెరికన్ విద్యాసంస్థల నుంచి గ్రాడ్యుయేట్ అయిన విదేశీ విద్యార్థులకు( Foreign Graduates ) నేరుగా గ్రీన్‌కార్డ్( Green Card ) ఇవ్వాలని ట్రంప్ ప్రతిపాదించారు.అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో తన హామీలు, తాజా రాజకీయ పరిణామాలపై ఆయన చర్చా కార్యక్రమాలు, ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు.ఈ క్రమంలోనే విదేశీ నిపుణుల నియామకంపై మీ ప్రణాళికలేంటంటూ ఎదురైన ప్రశ్నకు ట్రంప్ ఆసక్తికరంగా వ్యాఖ్యలు చేశారు.
గ్రాడ్యుయేషన్ పూర్తి కాగానే విదేశీ విద్యార్ధి అమెరికాలో ఉండేందుకు వీలుగా గ్రీన్‌కార్డ్ ఇవ్వాలని తాను అనుకుంటున్నట్లు మాజీ అధ్యక్షుడు చెప్పారు.ఎన్నికల్లో గెలిచిన తక్షణం దీనిపై కసరత్తు ప్రారంభిస్తానని , గతంలో కోవిడ్ కారణంగా దీనిని అమలు చేయలేకపోయానని ఆయన పేర్కొన్నారు.వీసా ఇబ్బందుల వల్లే భారత్, చైనా తదితర దేశాలకు చెందిన నిపుణులు అమెరికాలో ఉండేందుకు కుదరక స్వదేశాలకు వెళ్లిపోతున్నారని ట్రంప్ చెప్పారు.అయితే సహజంగానే అమెరికా ఫస్ట్( America First ) నినాదానికి పెట్టింది పేరైన ట్రంప్ నోటి వెంట ఇలాంటి వ్యాఖ్యలు రావడం రాజకీయ వర్గాలను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.అక్రమ వలసదారుల వల్ల స్థానికులకు ఉపాధి అవకాశాలు దొరక్కపోగా.అమెరికాలో నిరుద్యోగం, హింస, నేరాలు, వనరుల దోపిడీ జరుగుతోందని ట్రంప్ ఎప్పటి నుంచో మండిపడుతున్నారు.