పేరు మార్చుకున్న ముద్రగడ.. ఇరకాటంలో కొడాలి నాని 

2024 ఎన్నికలకు ముందు ఏపీ రాజకీయాల్లో అనేక సవాళ్లు,  ప్రతి సవాళ్లు కొనసాగాయి.ఎట్టి పరిస్థితుల్లోనూ టిడిపి( TDP ) గెలిచే అవకాశం లేదని, మళ్లీ వైసీపీని అధికారంలోకి వస్తుందనే నమ్మకంతో సవాళ్లు విసిరిన వైసిపి నేతలకు ఎన్నికల ఫలితాలు తర్వాత ఆ  సవాళ్లే ఇబ్బందికరంగా మారాయి.

 Mudragada Padmanabham Officially Changes Name To Padmanabha Reddy Troubles To Ko-TeluguStop.com

పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గెలిస్తే తన పేరు ముద్రగడ పద్మనాభ రెడ్డి గా( Mudragada Padmanabha Reddy ) మార్చుకుంటానంటూ మాజీ మంత్రి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ప్రకటించారు.కానీ ముద్రగడ ఊహించినదానికంటే  ఏపీలో టిడిపి, జనసేన, బిజెపి అధికారంలోకి రావడం,  పిఠాపురంలో పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) భారీ మెజారిటీతో గెలవడంతో ముద్రగడ పద్మనాభం చేసిన సవాల్ కు కట్టుబడి తన పేరును ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మార్చుకున్నారు.

Telugu Ap Challenges, Chandrababu, Janasena, Kodali Nani, Pawan Kalyan, Pithapur

ఈ మేరకు  ప్రభుత్వం కూడా  నోటిఫికేషన్ విడుదల చేసింది.ముద్రగడ తన సవాల్ ను నెరవేర్చడంతో,  వైసిపిలోని మరో ముగ్గురు నేతలు ఇరకాటంలో పడ్డారు .టిడిపి ఏపీలో అధికారంలోకి వస్తే చంద్రబాబు బూట్లు తుడుస్తానంటూ గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని( Kodali Nani ) ఎన్నికలకు ముందు సవాల్ చేశారు.ఇక గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి( Kasu Mahesh Reddy ) కూడా అదే విధంగా సవాల్ చేశారు  టిడిపి అధికారంలోకి వస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానంటూ ప్రకటించారు.

Telugu Ap Challenges, Chandrababu, Janasena, Kodali Nani, Pawan Kalyan, Pithapur

ఇక మాజీ మంత్రి ఇటీవల ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసి ఓటమి చెందిన అనిల్ కుమార్ యాదవ్( Anil Kumar Yadav ) కూడా పల్నాడులో టిడిపి గెలిస్తే రాజకీయాలు వదిలేస్తానంటూ సవాల్ చేశారు.ఇప్పుడు వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం తన పేరును పద్మనాభ రెడ్డి గా మార్చుకుని ఆ సవాల్  కు కట్టుబడి ఉండడంతో,  వైసిపి లోని ఈ ముగ్గురు నేతలకు ఇబ్బందికరంగా మారింది.దీంతో కొడాలి నాని, అనిల్ కుమార్ యాదవ్,  కాసు మహేష్ రెడ్డి తాము చేసిన సవాల్ కు కట్టుబడి ఉంటారా లేక సైలెంట్ అయిపోతారా అనేది మరికొంత కాలం వేసి చూడాల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube