పేరు మార్చుకున్న ముద్రగడ.. ఇరకాటంలో కొడాలి నాని 

2024 ఎన్నికలకు ముందు ఏపీ రాజకీయాల్లో అనేక సవాళ్లు,  ప్రతి సవాళ్లు కొనసాగాయి.

ఎట్టి పరిస్థితుల్లోనూ టిడిపి( TDP ) గెలిచే అవకాశం లేదని, మళ్లీ వైసీపీని అధికారంలోకి వస్తుందనే నమ్మకంతో సవాళ్లు విసిరిన వైసిపి నేతలకు ఎన్నికల ఫలితాలు తర్వాత ఆ  సవాళ్లే ఇబ్బందికరంగా మారాయి.

పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గెలిస్తే తన పేరు ముద్రగడ పద్మనాభ రెడ్డి గా( Mudragada Padmanabha Reddy ) మార్చుకుంటానంటూ మాజీ మంత్రి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ప్రకటించారు.

కానీ ముద్రగడ ఊహించినదానికంటే  ఏపీలో టిడిపి, జనసేన, బిజెపి అధికారంలోకి రావడం,  పిఠాపురంలో పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) భారీ మెజారిటీతో గెలవడంతో ముద్రగడ పద్మనాభం చేసిన సవాల్ కు కట్టుబడి తన పేరును ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మార్చుకున్నారు.

"""/" / ఈ మేరకు  ప్రభుత్వం కూడా  నోటిఫికేషన్ విడుదల చేసింది.ముద్రగడ తన సవాల్ ను నెరవేర్చడంతో,  వైసిపిలోని మరో ముగ్గురు నేతలు ఇరకాటంలో పడ్డారు .

టిడిపి ఏపీలో అధికారంలోకి వస్తే చంద్రబాబు బూట్లు తుడుస్తానంటూ గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని( Kodali Nani ) ఎన్నికలకు ముందు సవాల్ చేశారు.

ఇక గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి( Kasu Mahesh Reddy ) కూడా అదే విధంగా సవాల్ చేశారు  టిడిపి అధికారంలోకి వస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానంటూ ప్రకటించారు.

"""/" / ఇక మాజీ మంత్రి ఇటీవల ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసి ఓటమి చెందిన అనిల్ కుమార్ యాదవ్( Anil Kumar Yadav ) కూడా పల్నాడులో టిడిపి గెలిస్తే రాజకీయాలు వదిలేస్తానంటూ సవాల్ చేశారు.

ఇప్పుడు వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం తన పేరును పద్మనాభ రెడ్డి గా మార్చుకుని ఆ సవాల్  కు కట్టుబడి ఉండడంతో,  వైసిపి లోని ఈ ముగ్గురు నేతలకు ఇబ్బందికరంగా మారింది.

దీంతో కొడాలి నాని, అనిల్ కుమార్ యాదవ్,  కాసు మహేష్ రెడ్డి తాము చేసిన సవాల్ కు కట్టుబడి ఉంటారా లేక సైలెంట్ అయిపోతారా అనేది మరికొంత కాలం వేసి చూడాల్సిందే.