వాట్ ఎన్ ఐడియా.. రేకులను పైకి ఎలా తీసుకెళ్తున్నారో చూడండి..!

పనిచేసే వారిలో రెండు రకాల వారు ఉంటారు.ఒకరు హార్డ్ వర్క్ చేసే వారైతే మరొకరు స్మార్ట్ వర్క్ చేసేవారు.

 What An Idea See How The Petals Are Carried Up Idea, Viral Latest, Viral News,-TeluguStop.com

అయితే హార్డ్ వర్క్ కంటే స్మార్ట్ వర్క్ చాలా బెటర్ అని చెప్పచ్చు.ఎందుకంటే స్మార్ట్ వర్క్ తో ఎంతటి కష్టమైన పనినైనా చెమట బొట్టు రాలకుండా ఈజీగా చేయొచ్చు.

ఈ విషయాన్ని మరోసారి నిరూపించారు కొందరు కార్మికులు.వీరు కోళ్ల ఫారం రూఫ్ ఏర్పాటు చేసే క్రమంలో రేకులను పైకి తీసుకెళ్లాల్సి వచ్చింది.

అయితే అది చాలా ఎత్తులో ఉంది.అంత పైకి బరువైన సిమెంట్ రేకును లాగటం శ్రమతో కూడుకున్నది.

అయితే శ్రమ పడకుండా వీరొక ట్రిక్ ద్వారా రేకులను ఈజీగా పైకి తీసుకెళ్లారు.వైరల్ అవుతున్న వీడియోలో వారు ఉపయోగించిన ట్రిక్ ఏంటో మీరు చూడొచ్చు.

వైరల్ వీడియోలో కోళ్ల ఫారం షెడ్‌ నిర్మిస్తున్న కార్మికులను చూడొచ్చు.వీరు రేకులను ఫస్ట్‌ ఫ్లోర్‌కి ఎక్కించేందుకు ఒక టెక్నిక్ యూజ్ చేశారు.ఫస్ట్‌ ఫ్లోర్‌ పైకి రెండు పెద్ద రాడ్లను ఉంచి ఆ రాడ్ల ద్వారా రేకులను తాడు సాయంతో పైకి తీసుకెళ్లడం కూడా మీరు చూడొచ్చు.ఇలా ఈ కార్మికులు తమ బుర్ర ఉపయోగించి కష్టమైన పనిని సులభంగా పూర్తి చేశారు.

ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది.దీన్ని చూసిన నెటిజన్లు కార్మికుల స్మార్ట్ వర్క్ కి ఫిదా అవుతున్నారు.స్మార్ట్ వర్క్ కనిపెట్టడంలో కార్మికుల తర్వాతే ఎవరైనా అని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.ఈ వీడియోకి ఇప్పటికే కోట్లలో వ్యూస్, 61 లక్షలకు పైగా లైకులు వచ్చాయి.

ఈ వైరల్ వీడియో ని మీరు కూడా చూసేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube