ర్తికేయ - నేహా శెట్టి కాంబినేషన్‌లో లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ సినిమా ప్రారంభం

యువ హీరో కార్తికేయ, ‘డీజే టిల్లు‘ ఫేమ్ నేహా శెట్టి జంటగా సినిమా రూపొందుతోంది.సైమా, ఆహా పురస్కార వేడుకల్లో బెస్ట్ డెబ్యూడెంట్ ప్రొడక్షన్ హౌస్ అవార్డులు అందుకున్న లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై ప్రొడక్షన్ నంబర్ 3గా రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేని నిర్మిస్తున్నారు.‘కలర్ ఫొటో’, ‘తెల్లవారితే గురువారం‘ తర్వాత ఆయన నిర్మిస్తున్న చిత్రమిది.సి.యువరాజ్ చిత్ర సమర్పకులు.క్లాక్స్ దర్శకుడు.

 Hero Kartikeya - Neha Sshetty's Next Under Loukya Entertainments Launched.kartik-TeluguStop.com

ఈ రోజు పూజా కార్యక్రమాలతో సినిమా ప్రారంభమైంది.కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేయడంతో పాటు రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేశారు.

హీరో హీరోయిన్ల మీద చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి కార్తికేయ సతీమణి లోహిత కెమెరా స్విచ్ఛాన్ చేయగా, నిర్మాత సూర్యదేవర నాగవంశీ క్లాప్ ఇచ్చారు.దర్శకుడు ‘ఉప్పెన’ ఫేమ్ సానా బుచ్చిబాబు స్క్రిప్ట్ అందించారు.

నిర్మాత బెన్నీ ముప్పానేని మాట్లాడుతూ “కార్తికేయకు ఇదొక డిఫరెంట్ సినిమా.కామెడీ డ్రామాగా, గోదావరి నేపథ్యంలో సాగే కథతో తెరకెక్కిస్తున్నాం.ఈ రోజు రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేశాం.తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, యానాం పరిసర ప్రాంతాల్లో ఏకధాటిగా చిత్రీకరణ చేస్తాం.

మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.స్వర్గీయ సిరివెన్నెల గారు మా చిత్రంలో ఒక పాట రాశారు.

ఆయన రాసిన ఆఖరి పాట ఇదే.మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తాం” అన్నారు.దర్శకుడు క్లాక్స్ మాట్లాడుతూ “డ్రామెడీ (డ్రామా ప్లస్ కామెడీ) జానర్ చిత్రమిది.ప్రతి ఒక్కరికీ కొత్తగా, విభిన్నంగా బతకాలని ఉంటుంది.కానీ, పరిస్థితుల ప్రభావంతో సాధారణంగా జీవిస్తారు.ఎవరు ఏమనుకున్నా, ఎన్ని అనుకున్నా తనకు నచ్చినట్టు జీవిస్తూ… తనదైన దారిలో వెళ్లే ఓ యువకుడి కథ ఇది” అని చెప్పారు.

కార్తికేయ, నేహా శెట్టి జంటగా నటిస్తున్న ఈ సినిమాలో అజయ్ ఘోష్, రాజ్ కుమార్ కసిరెడ్డి, శ్రీకాంత్ అయ్యంగార్, ‘ఆటో’ రామ్ ప్రసాద్, గోపరాజు రమణ, ఎల్బీ శ్రీరామ్, సురభి ప్రభావతి, కిట్టయ్య, అనితానాథ్, దివ్య నార్ని ప్రధాన తారాగణం.

ఈ చిత్రానికి యాక్షన్: పృథ్వీ శేఖర్, కాస్ట్యూమ్ డిజైనర్: అనూషా పుంజాల, పి.ఆర్.ఓ: పులగం చిన్నారాయణ, ఎడిటింగ్: విప్లవ్ న్యాసదం, సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి, కిట్టూ విస్సాప్రగడ, కృష్ణ చైతన్య, ప్రొడక్షన్ డిజైన్: సుధీర్ మాచర్ల, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: దుర్గారావు గుండా, సినిమాటోగ్రఫీ: సన్నీ కూరపాటి, కొరియోగ్రాఫర్: రఘు, మోయిన్ ,సంగీతం: మణిశర్మ, సహ నిర్మాతలు: అవనీంద్ర ఉపద్రష్ట, వికాస్ గున్నల, సమర్పణ: సి.యువరాజ్, నిర్మాత: రవీంద్ర బెనర్జీ ముప్పానేని, రచన – దర్శకత్వం: క్లాక్స్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube