కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు దొందూ దొందే:- కాంగ్రెస్ పార్టీ నాయకులు విమర్శ

పేదలను దోచుకోవడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దొందూ దొందే అని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ ఘాటుగ విమర్శించారు జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు దుర్గాప్రసాద్ మాట్లాడుతూ.పేద ప్రజలను దోచుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవిభక్త కవలలుగా వ్యవహరిస్తున్నాయని అన్నారు.

 Central And State Governments Are In Cahoots: - Criticism Of Congress Party Lead-TeluguStop.com

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న విధానాల వల్ల నేడు సామాన్య ప్రజలు బతికే పరిస్థితులు లేదని ఆవేదన వ్యక్తం చేశారు.యూపీఏ 2 ప్రభుత్వంలో నిత్యావసర వస్తువులు పేద ప్రజలకు అందుబాటులో ఉండేవని అన్నారు.

యూపీఏ దిగిపోయే సమయంలో గ్యాస్ ధర 414 రూపాయలు మరియు డిజిల్, పెట్రోల్ 55, 71 రూపాయలుగా మాత్రమే ఉండేదని అన్నారు.అంతర్జాతీయ స్థాయిలో క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగినా ప్రభుత్వమే భరించేదని అన్నారు.

కానీ నేటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను దోచుకునేందుకు ఇబ్బడి ముబ్బడిగా ధరలను పెంచుతూ సామాన్యుల నడ్డి విరుస్తోందని మండిపడ్డారు.

కేంద్ర ప్రభుత్వం 8 సంవత్సరాల కాలంలో పన్నుల రూపంలో 26లక్షల కోట్లు మరియు రాష్ట్ర ప్రభుత్వం 10లక్షల కోట్ల రూపాయలు ప్రజలపై భారం మోపాయని అన్నారు.

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఈ 8 ఏండ్ల కాలంలో పేదలపై 36లక్షల కోట్ల రూపాయలు పన్నులు రూపంలో పేదలపై భారం మోపాయని అన్నారు.ఎన్నికలకు ముందు అణా పైసా కూడా పెంచని ప్రభుత్వాలు 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తరువాత అమాంతం ధరలు పెంచుతున్నాయని అన్నారు.

వాస్తవానికి పెట్రోల్ అన్ని ఖర్చులు కలుపు కోని లీటర్ 50 రూపాయలకే అందించవచ్చు కానీ రాష్ట్ర ప్రభుత్వం 35రూపాయలు, కేంద్ర ప్రభుత్వం 30 రూపాయలు వ్యాట్ రూపంలో ప్రజలను దోచుకుంటున్నాయని అన్నారు.అక్టోబర్ 4 2021న సవిల్ సప్లయ్ కమిషనర్ అనిల్కుమార్ ఎఫ్ సీఐకి లేఖ రాసారు.

భవిష్యత్ లో పారబోయిల్డ్ రైస్ ఇవ్వమని కేసీఆర్ సంతకం పెట్టారని ఈ సంతకంతో కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ రైతుల జుట్టు కేసీఆర్ అందించారని అన్నారు.నువ్వు లేఖ రాయకపోతే కేంద్ర ప్రభుత్వ మెడలు వంచైనా పరిధాన్యం కొనేలా వత్తిడి తెచ్చేవాళ్ళమని అన్నారు.

కేంద్ర ప్రభుత్వంతో చేతులు కలిపి రైతుల ఉసురు పోసుకుంటున్న కేసీఆర్ను టీఆర్ఎస్ నేతలను అమరవీరుల స్థూపం దగ్గర రైతులతో రాళతొ కొట్టించాలి.పొరబోయిల్డ్ రైస్ ఇవ్వమని సంతకం పెట్టినందుకు ప్రగతిభవన్ నుండిబయటికి వచ్చి ముక్కునేలకు దాసి తెలంగాణ రైతాంగానికి క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోందని అన్నారు.

వడ్లు కొనుగోలుపై మార్చి మొదటి వారంలోపే సిద్ధం చేసుకోవాల్సి ఉంది.కానీ ఏప్రిల్ వచ్చినా ఇంతవరకు ఓ అంచనా అంటూ లేదని అన్నారు.

డిస్కంలకు రాష్ట్ర ప్రభుత్వం మొండి.బకాయి 15వేల కోట్ల బాకీ ఉంది.

దివాలా తీసిన డిస్కంల భారం మళ్ళీ ప్రజలపైనే మోపుతున్నారని.అన్నారు.

ప్రజల నుండి 15వేల కోట్ల రూపాయాలను రాబట్టాలని విద్యుత్ సంస్థలు చూస్తున్నాయని, కేసీఆర్ తెలంగాణ ప్రజలను నిలువునా దోచుకుంటున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు.చెరకు ఫ్యాక్టరీలను మూసేశారని, పసుపు, మిర్చి తోటలకు తెగులు వచ్చిందని మరియు మొక్కజొన్న కొనే పరిస్థితి లేదని ప్రశ్నించారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరావు, నగర కాంగ్రెస్ అద్యక్షుడు జావేద్, నాయకులు రాయల నాగేశ్వరావు, జిల్లా యుత్ కాంగ్రెస్ అధ్యక్షులు యడ్లపల్లి సంతోష్, జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు మొక్కా శేఖర్ గౌడ్, కార్పొరేటర్లు దుద్దుకూరి వెంకటేశ్వర్లు, పల్లెబోయిన భారతీ చంద్రం తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube