వేగేశ్న సతీష్ 'కథలు(మీవి మావి)' వెబ్ సిరీస్ !

ప్రస్తుతం టాలీవుడ్లో వెబ్ సిరీస్ ల ట్రెండ్ నడుస్తోంది.ఇప్పటికే కొందరు సీనియర్ దర్శకులు కూడా వెబ్ సిరీస్ లు చేస్తూ OTT ఆడియన్స్ ని మెప్పిస్తున్నారు.

 Vegesna Sathish Set To Make His Ott Debut With A Web Series, Kathalu (meevi Maav-TeluguStop.com

ఈ నేపథ్యంలో ఫ్యామిలీ చిత్రాల దర్శకుడు అనే బ్రాండ్ సొంతం చేసుకున్న డైరెక్టర్ వేగేశ్న సతీష్ కూడా OTT లో ఎంట్రీ ఇవ్వబోతున్నారు.ప్రస్తుతం ‘కోతి కొమ్మచ్చి’, ‘శ్రీ శ్రీ శ్రీ రాజా వారు’ సినిమాలు చేస్తున్న వేగేశ్న సతీష్ పల్లెటూరి కథలతో ఓ వెబ్ సిరీస్ కూడా చేస్తున్నారు.

అయితే ఇది పూర్తిగా ఆయన మార్క్ పల్లెటూరి కథలతో తెరకెక్కనున్న ఆంతాలజీతో కూడిన వెబ్ సిరీస్.అందుకే దీనికి ‘కథలు(మీవి మావి)’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు.

ఇప్పటికే మూడు కథలకు సంబంధించి షూటింగ్ పూర్తయింది.త్వరలోనే మిగిలిన కథలు షూట్ చేసి ఒక ప్రముఖ OTT సంస్థ ద్వారా విడుదల చేయనున్నారు.

ఫ్యామిలీ ఎమోషన్స్ తో కూడిన సినిమాలు తీసి దర్శకుడిగా మెప్పించిన వేగేశ్న సతీష్ ఈ వెబ్ సిరీస్ కూడా ఫ్యామిలీ ఆడియన్స్ హాయిగా చూసేలా ఎటువంటి వల్గారిటీ లేకుండా క్లీన్ ఎంటర్టైనర్ గా రూపొందిస్తున్నారు.ఈ సిరీస్ కోసం కొందరు ప్రముఖ నటీ నటులు అలాగే సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు.

త్వరలోనే మిగతా వివరాలు వెల్లడించనున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube