అఖండ సినిమాతో అద్భుతమైన విజయాన్ని అందుకున్న బోయపాటి తన తదుపరి చిత్రాన్ని ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేనితో చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు.ఇప్పటికే హీరో రామ్ కోసం బోయపాటి అద్భుతమైన కథను సిద్ధం చేశారని తెలుస్తుంది.
ప్రస్తుతం రామ్ లింగుస్వామి దర్శకత్వంలో ది వారియర్ చిత్రంతో బిజీగా ఉన్నారు.ఈ సినిమా తర్వాత బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో పాల్గొన బోతున్నారు.
ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఓ సమాచారం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ప్రస్తుతం రామ్ హీరోగా నటిస్తున్నది.
వారియర్ చిత్ర నిర్మాత శ్రీనివాసా చిట్టూరి, పాన్ ఇండియా లెవల్‌లో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయడం కోసం బోయపాటి కసరత్తులు చేస్తున్నారు.
ఈ క్రమంలోనే ఈ సినిమాలో హీరో సరసన నటించడం కోసం బాలీవుడ్ బ్యూటీను రంగంలోకి దించనున్నారని సమాచారం.
ఈ క్రమంలోనే బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న పరిణితి చోప్రాను ఈ సినిమాలో హీరోయిన్ గా తీసుకోవాలనే ఆలోచనలో దర్శకుడు బోయపాటి ఉన్నట్లు తెలుస్తోంది.ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో లేదో తెలియాలంటే ఈ విషయంపై దర్శకుడు స్పందించాల్సి ఉంటుంది.