బాలయ్య 107పై ఇంట్రెస్టింగ్ చర్చ.. ఇది కూడా రీమేకేనా అంటూ..

నందమూరి బాలకృష్ణ అఖండ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే.బోయపాటి శ్రీను తెరకెక్కించిన అఖండ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని భారీ వసూళ్లు కూడా రాబట్టింది.

 Balakrishna Gopichand Malineni Movie Interesting Update Details, Balakrishna, Ba-TeluguStop.com

చాలా రోజుల తర్వాత బాలయ్యకు ఇటు బోయపాటి కి మంచి విజయం దక్కడంతో ఆనందంగా ఉన్నారు.వీరిద్దరి కాంబోలో వచ్చిన హ్యాట్రిక్ సినిమా కూడా హిట్ అవ్వడమే కాదు కలెక్షన్స్ కూడా అదే రేంజ్ లో వచ్చాయి.

ఈ సినిమా సూపర్ హిట్ అందుకున్న ఖుషీలో బాలయ్య తన తర్వాత సినిమా కూడా స్టార్ట్ చేసారు.యాక్షన్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య 107 వ సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ అయ్యింది.

గోపిచంద్ మలినేని క్రాక్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు.ఇక ఇప్పుడు ఈ మాస్ వ్యక్తులు ఇద్దరు రంగంలోకి దిగడంతో సినిమా ఎలా ఉండబోతుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఈ సినిమా రెగ్యురల్ షూటింగ్ సిరిసిల్ల జిల్లాలో మొదలైంది.భారీ యాక్షన్ సీక్వెన్స్ తో ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ మొదలు పెట్టారు.రామ్, లక్ష్మణ్ కంపోజ్ చేసిన ఫైట్ తో షూటింగ్ స్టార్ట్ చేసారని లొకేషన్ ఫోటో లీక్ అవ్వడంతో బయటకు వచ్చింది.ఈ విషయంతో పాటు మరో అంశం కూడా బయటకు వచ్చింది.

ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.

ఆ వార్త ఏంటంటే.ఈ సినిమా కూడా రీమేక్ గా తెరకెక్కుతోంది అని.కన్నడ లో శివరాజ్ కుమార్ మఫ్టీ అనే సినిమా ఒకటి చేసారు.ఈ సినిమా సూపర్ హిట్ అయ్యి భారీ వసూళ్లు రాబట్టింది.శివరాజ్ కుమార్ కెరియర్ లోనే ఈ సినిమా చెప్పుకోదగినదిగా నిలిచింది.జయన్న-భోగేంద్ర నిర్మించిన ఈ సినిమాకు నార్తన్ దర్శకత్వం వహించారు.మఫ్టీ లో శివరాజ్ కుమార్ ఎలా కనిపించాడో.

ఆ లుక్ లోనే బాలయ్య కనిపిస్తున్నారని.ఇది అదే సినిమా రీమేక్ అని గుసగుసలు వినిపిస్తున్నాయి.

మరి నిజం ఏంటో తెలియాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube