విక్టరీ వెంకటేష్ కు రామానాయుడు పెట్టిన పేరేంటో తెలుసా?

సినిమా రంగంలో చాలా మంది నటీనటులు పేరు  మార్చుకుంటారు.తమ అసలు పేరును కాదని ఇండస్ట్రీలోకి వచ్చినాక.

 Venkatesh Original Name Kept By Ramanaidu, Ramanaidu , Venkatesh , Tollywood , S-TeluguStop.com

అవకాశాల కోసమో.? క్యాచివ్ గా ఉండాలనో? తెలియదు కానీ కొంత మంది తమ పేర్లలో మార్పులు చేసుకుంటారు.హీరోలతో పోల్చితే హీరోయిన్లు ఎక్కువగా వారి పేర్లను మార్చుకోవడం చూస్తుంటాం.అయితే తెలుగులో చాలా మంది టాప్ హీరోల పేర్లు కూడా ఒరిజినల్ వి వేరే ఉన్నాయి.

అంతేకాకుండా సినిమాల్లోకి వచ్చాక కొన్ని బిరుదులు తగిలించుకుని.వాటితోనే పిలువబడుతున్నారు.

వాస్తవానికి  చిరంజీవిని మెగాస్టార్ అని.నాగార్జునని కింగ్ అని, పవన్ కళ్యాణ్ ని పవర్ స్టార్ అని , వెంకటేష్ ను విక్టరీ బిరుదులతో పిలుస్తారు.జూనియర్ ఎన్టీఆర్ ను యంగ్ టైగర్ అని, అల్లు అర్జున్ ను ఐకాన్ స్టార్ అని, రాం చరణ్ ను మెగా పవర్ స్టార్ అని పిలుస్తారు.మహేష్ బాబును సూపర్ స్టార్ అంటాయి.

అటు విక్టరీ వెంకటేష్ గురించి తెలుసుకుంటే.ఆయన దివంగత మూవీ మొఘల్ డాక్టర్ దగ్గుబాటి రామానాయుడు వారసుడు.తండ్రి నిర్మాతగా గొప్ప సినిమాలను నిర్మిస్తే.వెంకటేష్ మాత్రం హీరోగా సెటిల్ అయ్యాడు.కుటుంబ కథా చిత్రాల్లో నటించి ఫ్యామిలీ హీరోగా మారిపోయాడు.తన కెరీర్ లో అత్యధిక సక్సెస్ రేట్ ఉన్న హీరోగా ఘనత సాధించాడు వెంకీ.

సినిమాల్లో వరుస విజయాలు అందుకోవడంతో ఆయనకు విక్టరీ అనే బిరుదు వచ్చింది.దీంతో వెంకటేష్ విక్టరీ వెంకటేష్ అయ్యాడు.

వాస్తవానికి వెంకటేష్ అసలు పేరు దగ్గుబాటి వెంకటేశ్వర్లు.ఇది తన తాతగారి పేరు.రామానాయుడు తన తండ్రితో పాటు తిరుపతి వెంకటేశ్వర స్వామి అంటే ఎంతో భక్త.అందుకే తన చిన్న కొడుక్కు వెంకటేశ్వర్లు అని పేరు పెట్టుకున్నాడు.

చిన్నప్పటి నుంచి వెంకీని రామానాయుడు ఎంతో గారాబంగా పెంచాడు.స్కూల్లో చేర్పించే సమయంలో వెంకటేశ్వర్లు కాస్త వెంకటేష్ గా మారింది.

స్కూల్ రికార్డుల్లో వెంకటేష్ గానే ఉండిపోయిది.అయితే వెంకటేష్ కు మాత్రం అసలు పేరు అంటేనే ఎంతో ఇష్టం.

అందుకే ఆయన పలు సినిమాల్లో వెంకటేశ్వర్లు అనే పేరునే పెట్టుకున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube