నా పైన తనకు ప్రేమ తగ్గిపోయింది అనుకున్నా.. పరశురామ్ భార్య కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో రైటర్ గా, డైరెక్టర్ గా పరశురామ్ మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారనే సంగతి తెలిసిందే.శ్రీరస్తు శుభమస్తు, గీతా గోవిందం సినిమాలతో పరశురామ్ బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ హిట్లను సొంతం చేసుకున్నారు.

 Parasuram Wife And Parasuram Comments Goes Viral In Social Media ,parasuram , Pa-TeluguStop.com

ప్రస్తుతం ఈ డైరెక్టర్ సర్కారు వారి పాట సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.ఈ సినిమా నుంచి కళావతి సాంగ్ నేడు యూట్యూబ్ లో రిలీజ్ కానుంది.

ఈ దర్శకుడు లవ్ మ్యారేజ్ చేసుకోగా ఇతని భార్య పేరు అర్చన.

పరశురామ్ మాట్లాడుతూ తనకు బాల్యం నుంచి అమ్మ అంటే ఇష్టమని అత్తయ్య చెల్లెల్ని కాలేజ్ లో డ్రాప్ చేయడానికి వెళ్లిన సమయంలో అర్చనను చూశానని పరశురామ్ అన్నారు.

అర్చనలో అమ్మ పోలికలు ఉన్నాయని అందుకే తనకు నచ్చిందని తర్వాత అర్థమైందని పరశురామ్ వెల్లడించారు.మొదట లవ్ ప్రపోజ్ చేసిన సమయంలో అర్చన నో చెప్పిందని పరశురామ్ అన్నారు.

అర్చన మాట్లాడుతూ నాన్న పోలీస్ ఆఫీసర్ అని తనది జాయింట్ ఫ్యామిలీ అని చెప్పుకొచ్చారు.

మొదట పరశురామ్ లవ్ ప్రపోజ్ చేసినప్పుడు నో చెప్పినా తర్వాత యస్ చెప్పానని ఆమె అన్నారు.ఇంట్లో ప్రేమ విషయం చెప్పిన సమయంలో అమ్మమ్మ వాత పెట్టిందని అర్చన చెప్పుకొచ్చారు.ఇంటి నుంచి పారిపోయి వెళ్లగా పరశురామ్ పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకుందామని చెప్పాడని అర్చన పేర్కొన్నారు.

పరశురామ్ కు దూరమై బ్రతకడం కంటే చావడం మేలనుకుని భావించానని అర్చన చెప్పుకొచ్చారు.పెళ్లైన తర్వాత పరశురామ్ షూటింగ్ లతో బిజీగా ఉండగా నాపై తనకు ప్రేమ తగ్గిపోయిందా అని అనిపించిందని అర్చన వెల్లడించారు.

పరశురామ్ మాట్లాడుతూ అర్చన అమ్మను మరపిస్తుందని తెలిపారు.సారొచ్చారు సినిమా తర్వాత మూడేళ్లు ఖాళీగా ఉండిపోవాల్సి వచ్చిందని పరశురామ్ పేర్కొన్నారు.

Sarakaru Vaari Paata Director Parasuram Real Life Love Story

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube