బాల‌య్య‌బాబు గారి వ‌ల్లే సెహ‌రి సినిమా స్థాయి పెరిగింది.. ప్రీరిలీజ్‌లో హీరో హ‌ర్ష్ కనుమిల్లి

హర్ష్‌ కనుమిల్లి, సిమ్రాన్‌ చౌదరి హీరో హీరోయిన్లుగా జ్ఞానసాగర్‌ ద్వారక దర్శకత్వంలో రూపొందిన‌ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ ‘సెహరి’.వర్గో పిక్చర్స్ ప‌తాకంపై అద్వయ జిష్ణు రెడ్డి నిర్మించిన‌ ఈ సినిమా ఫిబ్ర‌వ‌రి 11న విడుద‌ల‌వుతుంది.

 Hero Harsh Kanumilli Comments On Balakrishna Sehari Pre Release Event Details, H-TeluguStop.com

ఈ సంద‌ర్భంగా ప్రీరిలీజ్ వేడుక హైద‌రాబాద్‌లోని పార్క్ హ‌య‌త్‌లో సోమ‌వారం రాత్రి ఘ‌నంగా జ‌రిగింది.

ఈ సందర్బంగా  హీరో హ‌ర్ష్ కనుమిల్లి మాట్లాడుతూ, మా సినిమాకు అంద‌రూ బాగా స‌పోర్ట్ చేశారు.

సోష‌ల్ మీడియాలో మీమ్స్‌ ద్వారా మంచి మైలేజ్ వ‌చ్చింది.ఈరోజు హీరో విశాల్ గారు రావాల్సి వుంది.

కొన్ని కార‌ణాల‌ వ్ల‌ల రాలేక‌ పోయారు.నేను స్కూల్ డేస్‌లో వ‌ర‌స్ట్ స్టూండెట్‌ను.

చాలా సార్లు ఫెయిల్ అయ్యాను.నేను కొన్ని షాట్ ఫిలింస్ చేశాను.

కొన్ని సినిమాల‌కు ఆడిష‌న్ వెళ్ళాను.కానీ ఎక్క‌డా సెల‌క్ట్ కాలేదు.

అప్పుడు నా స్నేహితులు నీకు నువ్వే ప్రూవ్ చేసుకోవాల‌న్నారు.దాంతో క‌సి పెరిగింది.

అలా హీరోగా సెహ‌రి చేశాను.మా సినిమా లాక్‌డౌన్ టైంలో బాల‌య్య‌ బాబు గారు  పోస్ట‌ర్ లాంచ్ చేశారు.దాంతో సెహ‌రి స్థాయి పెరిగింది.మ‌రోసారి ఆయ‌న‌కు ధ‌న్య‌వాదాలు తెలియ‌ జేసుకుంటున్నాను.

అలాగే ఆదిత్య మ్యూజిక్ ద్వారా పాట‌లు విడుద‌లై మంచి ఆద‌ర‌ణ పొందాయి.య‌శ్ మాస్ట‌ర్ బాగా కంపోజ్ చేశారు.

కెమెరామెన్ భ‌విష్య‌త్‌లో మంచి స్థాయికి ఎదుగుతాడు.మంచి క‌ల‌ర్స్ ఇందులోవాడాడు.

అనీషా పెట్ ల‌వ‌ర్‌గా న‌టించింది.చాలామందికి క‌నెక్ట్ అవుతుంది.

అక్షిత పాత్ర స‌స్పెన్స్‌తో వుంటూ ఎంట‌ర్‌టైన్ చేస్తుంది.సంగీత ద‌ర్శ‌కుడు కోటిగారు మా చిత్రానికి ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచారు.

అంద‌రూ ఇందులో బాగా న‌టించారు.ఫుల్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ సినిమా.

మ‌ళ్లీ మ‌ళ్ళీ చూసేట్లుగా సెహ‌రి వుంటుంద‌ని గ‌ట్టిగా చెప్ప‌గ‌ల‌ను అని తెలిపారు.

సంగీత ద‌ర్శ‌కుడు కోటిగారు మాట్లాడుతూ, ఇందులో న‌న్ను న‌టుడిగా చూపించారు.కొత్త త‌ర‌హాలో క‌నిపిస్తాను.ప్ర‌శాంత్ సంగీతం సినిమాకు హైలైట్‌గా నిలుస్తుంది.

నేను సంగీతం చేసే తొలి రోజుల్లో అన్ని పాట‌లు హిట్ అవ్వాల‌నే క‌సితో చేసేవాడిని.అది ప్ర‌శాంత్‌లో చూశాను.

ఇందులో 9పాట‌లున్నాయి.అన్నీ కేచీగా వున్నాయి.

ఆయ‌నకు స‌రిప‌డా టీమ్‌కూడా దొరికింది.ఓసారి చిరంజీవి గారు నాతో ఇలా అన్నారు.

ఇన్నాళ్ళు సంగీతం చేశావ్‌.ఎంతో ఎంజాయ్ చేశావ్‌.

న‌టుడిగా చేస్తే బాగా ఎంజాయ్ చేస్తావ్ అని అన్నారు.అలాగే ఈ సినిమాలో న‌టించాను.

ముందు ముందు మంచి పాత్ర‌లు వ‌స్తే త‌ప్ప‌కుండా న‌టిస్తాన‌ని అన్నారు.

చిత్ర ద‌ర్శ‌కుడు జ్ఞానసాగర్‌ ద్వారక మాట్లాడుతూ, నా లైఫ్‌లో సెహ‌రి మ‌ర్చిపోలేనిది.

ఈ సినిమా చేయ‌డానికి బ్ర‌ద‌ర్ అనిల్ కార‌ణం.ఆయ‌న వ‌ల్లే ఈ సినిమా చేయ‌గ‌లిగాను.

హ‌ర్ష్ చెప్పిన క‌థ విన‌గానే వెంట‌నే చేస్తాన‌న్నా.అప్ప‌డే హిట్ అవుతుంద‌ని చెప్పాను.

మా ఇద్ద‌రి జ‌ర్నీ సూప‌ర్‌గా వుంది.సినిమాకు ఆరు పాట‌లు ఇవ్వ‌డ‌మే గ్రేట్ అనుకునే టైంలో 9 పాట‌లు ఇవ్వ‌డం మామూలు విష‌యం కాదు.

అన్నీ అద్భుతంగా వ‌చ్చాయి.ఇందులో అంద‌రూ బాగా న‌టించార‌ని తెలిపారు.

నిర్మాత అద్వయ జిష్ణు రెడ్డి మాట్లాడుతూ, రెండు లాక్‌డౌన్‌లు త‌ట్టుకుని ఈస్థాయికి వ‌చ్చాం.ఓటీటీలో మంచి ఆఫ‌ర్లు వ‌చ్చాయి.కానీ థియేట‌ర్‌లోనే ఈ సినిమా చూస్తే సెల‌బ్రేష‌న్ చేసిన‌ట్లుంటుంది.అందుకే అంద‌రూ థియేట‌ర్‌లోనే ఈనెల 11న చూడండి అంటూ తెలిపారు.

సంగీత ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ విహారి మాట్లాడుతూ, సెల‌బ్రేష‌న్ మొద‌ల‌య్యాయి.కోటిగారి సంగీతానికి నేను అభిమానిని.

క‌మ‌ర్షియ‌ల్ సినిమాల‌కు బాగా ట్యూన్ ఇస్తారు.ఈ ఫిలింలో ఆయ‌న‌తో షేర్ చేసుకునే భాగ్యం క‌లిగింది.

ఇందులో 9 పాట‌లున్నాయి.ర‌చ‌యిత‌ల‌కు, గాయ‌కుల‌కు పేరు పేరునా ధ‌న్య‌వాదాలు తెలియ‌జేస్తున్నాన‌ని అన్నారు.

క‌థానాయిక సిమ్ర‌న్ మాట్లాడుతూ, చాలా ఫ‌న్ మూవీ.నాతో చాలా ఓపిగ్గా న‌ట‌న రాబ‌ట్టుకున్నారు.

ఈ సినిమాను థియేట‌ర్‌లోనే చూడాలని ద‌ర్శ‌క నిర్మాత‌లు విడుద‌ల చేస్తున్నారు.ఫిబ్ర‌వ‌రి 11న చూసి ఎంజాయ్ చేయండి అని తెలిపారు.

క్యారెక్ట‌ర్ న‌టుడు బాల‌కృష్ణ మాట్లాడుతూ, ఇందులో అమ్మాయిల ఫాద‌ర్‌గా న‌టించాను.హర్ష్ పెద్ద స్టార్‌గా ఎదుగుతాడు.

ఇందులోని పాట‌లు చాలా కేచీగా వున్నాయి.సినిమా స‌క్సెస్ కావ‌డానికి అన్ని అంశాలు ఈ సినిమాలో వున్నాయి అని తెలిపారు.

ఇంకా కెమెరామెన్ అర‌వింద్ విశ్వ‌నాథ్‌, ఎడిట‌ర్ ర‌వితేజ గిరిజాల, అక్షిత, అనీషా త‌దిత‌రులు మాట్లాడుతూ, చిత్రం విజ‌య‌వంతం కావాల‌ని ఆకాంక్షించారు.

Hero Harsh Kanumilli Comments On Balakrishna Sehari Pre Release Event Details, Hero Harsh Kanumilli ,comments ,balakrishna ,sehari Pre Release Event, Tollywood, Heroine Simran, Sehari Movie, Director Gnanasagar Dwaraka, Music Director Koti - Telugu Balakrishna, Harsh Kanumilli, Simran, Music Koti, Sehari, Sehari Pre, Tollywood

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube