వైరల్: ఏడవకపోతే కొడుకుకు రూ. 100 ఇస్తానంటున్న తండ్రి..!

పిల్లల అల్లరి భరించాలంటే తల్లితండ్రులకు చాలా ఓపిక ఉండాలి.ఎందుకంటే ఈ కాలం పిల్లలు చేసే అల్లరి అలాంటింది మరి.

 Viral: Rs. Father Who Wants To Give 100, Viral Latest, Viral News, Social Media,-TeluguStop.com

అసలు వాళ్ళు పిల్లలా.లేక పిడుగులా అనేలా ఇల్లు పీకి పందిరి వేస్తూ ఉంటారు.

వాళ్ళు అడిగింది ఇవ్వకపోయినా, చెప్పింది చేయకపోయినా ఏడుపు మొదలుపెడతారు.పిల్లలు తల్లిదండ్రులపై ప్రయోగించే మొట్ట మొదటి వేపన్ ఏదన్నా ఉంది అంటే అది ఏడుపు అని అనడంలో అతిశయోక్తి లేదనే చెప్పాలి.

తాము కోరుకున్నది దక్కించుకునే వరకు వాళ్ళు తీసే కూనిరాగాలు చూస్తే తల్లి తండ్రులకు విసుగు రాకుండా ఉండదు.ఒక్కోసారి ఆ ఏడుపు మాన్పించడానికి వాళ్ళని కొట్టడమే, తిట్టడమే చేస్తూ ఉంటాము.

లేదంటే వాళ్ళు అడిగినది కొనిపెట్టడం అన్నా చేస్తూ ఉంటాము కదా.

ఈ క్రమంలోనే ఒక ఆరి తేరిన ఏడేళ్ల బుడ్డోడు తనకు కావాల్సిన వస్తువుల కోసం ఏకంగా తన తండ్రితోనే ఒక అగ్రిమెంట్ కుదుర్చుకున్నాడు.ప్రస్తుతం ఈ అగ్రిమెంట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.ఇంతకీ ఆ అగ్రిమెంట్ లో ఏముందో తెలిస్తే మీరే షాక్ అవుతారు.అసలు వివరాల్లోకి వెళితే.ఓ ట్విట్టర్ యూజర్ తన ఆరేళ్ల కుమారుడు అబీర్‌తో చేసుకున్న అగ్రిమెంట్ తాలూకు చిత్రం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

దానిని ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు.ఈ అగ్రిమెంట్‌ లో ఆ బాలుడి ప్లేయింగ్ టైమ్ నుంచి రాత్రి పడుకునే సమయం వరకు రోజువారీ షెడ్యూల్‌ను ప్లాన్ చేసి రాసారు .ఉదయాన్నే ఏ సమయానికి అలారం మొగుతుందో దగ్గర నుండి అతని భోజనం, గేమ్స్, హోంవర్క్ చేయడం వరకు అన్నింటికీ ఇందులో సెపరేట్‌గా కొన్ని టైమ్ స్లాట్స్ ను కూడా కేటాయించారు.

అలాగే ఆ బాలుడు ‘ఏడవడం, కేకలు వేయడం, కొట్టుకోవడం లాంటివి చేయకుండా ప్రతీరోజు తన దినచర్యను షెడ్యూల్ ప్రకారం కొనసాగిస్తే అతనికి రూ.10 ఇచ్చేందుకు తండ్రి అంగీ కరించాడు.ఇలా ఒక వారం పాటు ఆ బాలుడు చేస్తే అతను రూ.100 పొంద గలుగుతాడు.ఇక ఈ ఒప్పందం గురించి మాట్లాడిన సదరు తండ్రి గతంలో పాయింట్ సిస్టమ్, స్టార్ చార్ట్‌ను ప్రయత్నించినప్పటికీ అవి సరిగా వర్కవుట్ అవ్వలేదని అందుకే ఈ ఆలోచన చేసానని చెప్పాడు.

ప్రస్తుతం ఈ ఒప్పందం బానే వర్క్ అవుట్ అవుతుందని కూడా తెలిపారు.ఈ ఒప్పందాన్ని కొందరు నెటిజన్లు చూసి కొందరు పాజిటివ్ గా తీసుకుంటే మరికొందరు నెగటివ్ కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube