నాట్స్ ఆధ్వర్యంలో మహిళలకు ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన

అమెరికాలో తెలుగు జాతికి అండగా నిలుస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ .తాజాగా మహిళా సాధికారితపై దృష్టి సారించింది.

 Nats Awareness On Financial Literacy For Women Event, Nats, North America Telugu-TeluguStop.com

మహిళలు ఆర్ధిక స్వావలంబన సాధించడం కుటుంబానికి ఎంతో కీలకమనే విషయాన్ని మహిళలకువివరించడంతో పాటు వారిలో ఆర్థిక చైతన్యం తీసుకొచ్చేందుకు వరుస కార్యక్రమాలు చేపట్టేందుకు నాట్స్ బోర్డ్ ఛైర్ పర్సన్ అరుణ గంటి చొరవ తోనడుంబిగించారు.ఈ క్రమంలోనే మహిళల ఆర్థిక తొలి ఆన్‌లైన్ వెబినార్ నిర్వహించారు.

ముఖ్యంగా వివాహితలు పెళ్లయిన దగ్గర నుంచే ఎలా ఆర్థిక అప్రమత్తత కలిగి ఉండాలి.ప్రమాదవ శాత్తు ఇంటి పెద్ద దిక్కును కోల్పోతే.

కుటుంబాన్ని ఆర్థికంగా ఎలా సురక్షితంగా ఉంచుకోవాలి.? ఆర్థిక అంశాలపై మహిళలకు అవగాహన ఎందుకు అత్యంత అవసరం అనే విషయాలను సవివరంగా ఈ వెబినార్‌లో వివరించారు.మాధవి దొడ్డి ఈవెబినార్‌ కు వ్యాఖ్యాతగా వ్యవహరించారు.ఆర్థిక భద్రత గురించి మహిళలు కచ్చితంగా తెలుసుకోవడంతో పాటు దానిని సాధించడం కోసం పాటించాల్సిన పద్దతులపై కూడా అవగాహన కల్పించడమే తమ లక్ష్యమని నాట్స్ బోర్డ్ ఛైర్ పర్సన్ అరుణ గంటి అన్నారు.

మహిళలను ఆర్ధిక అంశాలపై చైతన్యం చేసేందుకు వరుస వెబినార్స్ తో నాట్స్ తన వంతు కృషిచేస్తుందని ఆమె తెలిపారు.వందల మంది తెలుగు మహిళలు ఆన్‌లైన్ ద్వారా ఈ వెబినార్‌లో పాల్గొన్నారు.

ఆర్ధికఅంశాలపై తమకు తెలియని ఎన్నో విషయాలను తెలుసుకునేలా చేసినందుకు నాట్స్‌కు వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమ నిర్వహణకు సమన్వయం చేసిన జయశ్రీ పెద్దిభొట్ల, లక్ష్మి బొజ్జ, జ్యోతి వనం,శృతి అక్కినేని లను నాట్స్అధ్యక్షుడు శేఖర్ అన్నే ప్రత్యేకంగా అభినందించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube