కాపురంలో చిన్న చిన్న మనస్పర్థలు రావడం సహజం.నేటి కాలం దంపతులు చిన్న చిన్న కారణాలకే విడిపోతూ విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కుతున్నారు.
టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ లలో ఎన్నో జంటలు విడాకులు తీసుకోవడం మనం చూశాం.అందుకు వారు చెప్పిన కారణాలను కూడా మనం విన్నాం.
అందుకు డిఫరెంట్ గా ఓ మహిళ తన భర్తతో విడాకులు తీసుకోవడం కాదు కదా ఏకంగా ఆన్ లైన్ లో అమ్మకానికి పెట్టింది.తన భర్తను ఎందుకు విక్రయించాలనుకుంటుందో ఆమె చెప్పిన రీజన్ విని అందరూ ఒక్క సారిగా షాక్ అయ్యారు.
ఇంతకీ ఆమె తన భర్తను అమ్మకానికి పెట్టడానికి గల రీజన్ ఏంటంటే.
న్యూజిలాండ్ లో ఉండే మెక్ అలిస్టర్, రోమింగ్ భార్యా భర్తలు.
వీరికి సంతానం కూడా ఉన్నారు.కానీ ఇటీవల ఏమనిపించిందో ఏమో కానీ మెక్ తన భర్తను ఆన్ లైన్ లో విక్రయానికి పెట్టింది.
తన భర్త చెప్పా పెట్టకుండా తమను వదిలేసే వాకింగ్ కు వెళ్తున్నాడని అందు కోసమనే అతడిని వదిలించుకోవాలని చూస్తున్నట్లు తెలిపింది.తన భర్త వ్యవసాయం చేస్తుంటాడని, 6.1 అడుగుల పొడవు ఉంటాడని తెలిపింది.తాను చాలా నిజాయతీ పరుడని కూడా పేర్కొంది.
అంతే కాకుండా తన భర్తకు యూజ్డ్ కండీషన్ అని ఒక ట్యాగ్ పెట్టి ఆన్ లైన్ లో అతడిని విక్రయానికి పెట్టింది.ఇది విన్న కొందరు ఇదేం వింత అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇదేం వింత కాదు.ఇదే ఇప్పుడు అసలు వింత.
నడుస్తున్న ట్రెండ్ అని కొందరు అంటున్నారు.ఎంతైనా మెక్ పూర్తిగా తెగించేసింది కదూ.వాకింగ్ కు వెళ్తున్నాడనే కారణం చెప్పి ఇలా చేయడం మరీ దారుణం కదా.మరి ఏమంటారు.అంతే కాకుండా షిప్పింగ్ చార్జీలు కూడా లేవని అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది.