చర్మ సమస్యలకు పెసరపిండి పేస్ పాక్స్

పెసరపిండిని మన పూర్వీకుల కాలం నుండి చర్మ సంరక్షణలో ఉపయోగిస్తూ ఉన్నారు.పెసరపిండి చర్మంపై ఒక మ్యాజిక్ వలే పనిచేస్తుంది.

 Moongdalpowder Pace Pax For Skin Problems , Moongdalpowder , Face Pack, Olive Oi-TeluguStop.com

మొటిమలు,మొటిమల మచ్చలు, జిడ్డుని ఇలా అన్ని రకాల సమస్యలను తగ్గిస్తుంది.ఇప్పుడు చెప్పే పాక్స్ ఉపయోగిస్తే చర్మ సమస్యల నుండి బయటపడవచ్చు.

వాటిని ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం.అరస్పూన్ పెసరపిండిలో అరస్పూన్ ఆలివ్ ఆయిల్ వేసి బాగా కలపాలి.

ఈ మిశ్రామన్ని ముఖానికి పట్టించి 15 నిమిషాల తర్వాత రబ్ చేసుకొని గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.ఈ విధంగా వారానికి ఒకసారి చేస్తూ ఉంటే ముఖంపై ఫ్లాకీనెస్ తొలగిపోతుంది.

పెసలను ఉడికించాలి.ఒక స్పూన్ ఉడికించిన పెసలలో ఒక స్పూన్ తేనే వేసి పేస్ట్ గా చేయాలి.

ఈ పేస్ట్ ని ముఖానికి పట్టించి ఆరిన తర్వాత ముఖాన్ని చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే ముఖం మీద మొటిమలు మాయం అవుతాయి.ఒక స్పూన్ పెసరపిండిలో రెండు స్పూన్ల నిమ్మరసం కలిపి ముఖానికి పట్టించి ఆరిన తర్వాత ముఖాన్ని చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే ముఖం మీద టాక్సిన్స్ తొలగిపోతాయి.

అర స్పూన్ పెసరపిండిలో 2 స్పూన్ల కలబంద జెల్ వేసి బాగా కలపాలి.ఈ పేస్ట్ని ముఖానికి పట్టించి ఆరిన తర్వాత ముఖాన్ని చల్లని నీటితో శుభ్రంచేసుకుంటే ముఖం మీద సన్ తాన్ తొలగిపోతుంది.

ఈ విధంగా రోజు విడిచి రోజు చేయాలి.

Moongdalpowder Pace Pax For Skin Problems , Moongdalpowder , Face Pack, Olive Oil - Telugu Face Pack, Moongdalpowder, Olive Oil

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube