సంతోషంగా పంచ్‌లు పేలుస్తూ చెప్పుకునే ‘హై ఫైవ్’ ఎలా ప్రారంభమయ్యిందో తెలిస్తే..

మనం సంతోషంగా ఉన్నప్పుడు ఎదుటివారి హస్తానికి మన హస్తాన్ని తాకిస్తూ ‘హై ఫైవ్’ అని చెబుతూ నవ్వుతుంటాం.ఇది భారతదేశంలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగానూ కనిపిస్తుంది.

 If You Know How ‘high Five’, Which Is Said To Explode Happy Punches, Started-TeluguStop.com

అమెరికాలో నేషనల్ హై ఫైవ్ డే ప్రతి సంవత్సరం ఏప్రిల్ 21న నిర్వహిస్తుంటారు.దీని ప్రారంభం అత్యంత ఆశ్చర్యకరంగా సాగింది.బిజినెస్ ఇన్‌సైడర్ తెలిపిన వివరాల ప్రకారం ‘హై ఫైవ్‌’ చెప్పుకోవడమనేది బేస్‌బాల్‌ క్రీడతో ముడిపడివుంది.1977లో లాస్ ఏంజెల్స్ డాడ్జర్స్, హ్యూస్టన్ ఆస్ట్రోస్ జట్ల మధ్య జరిగిన బేస్ బాల్‌ క్రీడలో ‘హై ఫైవ్‌’ చెప్పుకోవడం ప్రారంభమయ్యింది.అది ఛాంపియన్‌షిప్‌లో చివరి రోజు.ఆరో ఇన్నింగ్స్.ఈ సమయంలో, ఒక ఆటగాడు.స్కోరు విజయం దిశగా ఉన్నట్లు చూసి… తన చేతిని గాలిలో పైకి లేపాడు.

మరొక ఆటగాడు అతని హస్తాన్ని తన హస్తంతో కొట్టి.వెనక్కి వెళ్లాడు.

ఇలా మొదటి హై ఫైవ్ చెప్పుకోవడం మొదలైంది.

అలాగే యూఎస్ఏలోని లూయిస్‌విల్లే విశ్వవిద్యాలయంలో 1978-1979 సీజన్‌లో కార్డినల్స్ బాస్కెట్‌బాల్ ప్రాక్టీస్ సమయంలో దీనిని గమనించినట్లు ఒక రిపోర్టు తెలియజేస్తోంది.

మ్యాచ్ సమయంలో ఆటగాడు విల్లీ బ్రౌన్.డెరెక్ స్మిత్‌కు లో-ఫైవ్ ఇచ్చాడు.

అయితే స్మిత్.ఆటగాడు బ్రౌన్ కళ్లలోకి చూస్తూ, ‘లో కాదు.

హై ఫైవ్’ అని అన్నాడు.ఇదే హై ఫైవ్‌కు నాందిగా మారింది.

కాలక్రమేణా అది చిన్న చిన్న ఆనందాలను జరుపుకోవడంలోనూ భాగంగా మారింది.హై ఫైవ్‌లు ఇచ్చే ప్రక్రియ ఆట స్థలంలోనే కాదు, కార్యాలయంలో కూడా ప్రారంభమైంది.

ఇది 80- 90 దశాబ్దాల నాటికే భారతదేశంలో ఒక ట్రెండ్‌గామారింది.అప్పట్లో దీనిని ‘డి క్లాప్’ అనేవారు.

అమెరికన్ క్యాలెండర్‌లో ఏప్రిల్ 21న నేషనల్ హై ఫైవ్ డేగా నమోదయ్యింది.వర్జీనియా విశ్వవిద్యాలయ విద్యార్థులు హై ఫైవ్ డేను ప్రారంభించారు.2002 నుండి అమెరికా అంతటా నేషనల్ హై ఫైవ్ డే జరుపుకోవడం ప్రారంభించారు.07:06 18-01-2022

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube