కేసిఆర్ నాయకత్వంలోనే ఆదివాసీ, గిరిజనులకు గౌరవం దక్కింది శ్రీమతి సత్యవతి రాథోడ్

సీఎం కేసిఆర్ గారి సంక్షేమ, అభివృద్ధి పథకాలతో.మూడోసారి మరింత మెజారిటితో గెలుస్తాం తెలంగాణ అభివృద్ధి చూసి ఓర్వలేని బీజేపీ నేతలు అవాకులు, చెవాకులు పేలుతున్నారు కేసిఆర్ నాయకత్వంలోనే ఆదివాసీ, గిరిజనులకు గౌరవం దక్కింది త్వరలోనే పోడు భూములకు పట్టాలు.

సాగు యోగ్యంగా పోడు భూములు చేస్తాం రైతు బంధు పథకం ద్వారా రైతుల ఖాతాల్లో 50వేల కోట్లు జమ చేసిన ఏకైక రైతు నాయకులు సీఎం కేసిఆర్ రాష్ట్ర మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, శ్రీమతి సత్యవతి రాథోడ్.తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన టి.ఆర్.ఎస్ పార్టీని మొదటిసారి 63 సీట్లతో గెలిపిస్తే దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో అమలు జరుగుతున్న పథకాలు చూసి రెండో సారి 88 సీట్లతో గెలిపించారని, మూడోసారి ఇంతకు మించిన సీట్లతో ప్రజలు మళ్ళీ గెలిపిస్తారని రాష్ట్ర మంత్రులు శ్రీమతి సత్యవతి రాథోడ్, శ్రీ ఇంద్రకరణ్ రెడ్డిలు ధీమా వ్యక్తం చేశారు.నిర్మల్ జిల్లా పర్యటన సందర్భంగా ఫారెస్ట్ గెస్ట్ హౌజ్ లో జిల్లా కలెక్టర్, ఐటీడీఏ పీవో, అదనపు కలెక్టర్, గిరిజన, స్త్రీ- శిశు సంక్షేమ శాఖల అధికారులు, ఇతర జిల్లా అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులతో సమీక్ష చేశారు.

ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో మాట్లాడారు… రైతు బంధు పథకం ద్వారా అన్నదాతల ఖాతాల్లో 50 వేల కోట్ల రూపాయలు జమ చేసిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా రైతులు సంబరాలు జరుపుకుంటున్నారు.

రైతులందరికీ రైతు బంధు, సంక్రాంతి శుభాకాంక్షలు.

సీఎం కేసిఆర్ గారు తెలంగాణలో వ్యవసాయాన్ని పండగ చేయడం ద్వారా రైతును రాజు చేస్తున్నారు.

ఆదిలాబాద్ జిల్లాలో కూడా రైతులు నేడు అద్భుతంగా సాగుచేస్తున్నారు.తెలంగాణ రాకముందు ఇక్కడ 30 లక్షల ఎకరాలు సాగు అయితే సీఎం కేసిఆర్ గారి పాలనలో ఇపుడు కోటి 30 లక్షల ఎకరాలు సాగులోకి వచ్చాయి.3 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం పండుతుంది.

అసాధ్యం అనుకున్న కాళేశ్వరం ప్రాజెక్టును సుసాధ్యం చేసిన నాయకులు సీఎం కేసిఆర్ గారు.

ఎండిపోయింది అనుకున్న ఎస్.ఆర్.ఎస్.పిని సస్య శ్యామలం చేశారు.మిషన్ కాకతీయ పథకం ద్వారా చెరువులు నిండుగా నీళ్లతో కళకళలాడుతున్నాయి.

వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నారు.

రైతు బీమా ద్వారా దురదృష్టవశాత్తు చనిపోతే పెద్ద ఖర్మ లోపు ఆ కుటుంబానికి 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందుతుంది.ఇందుకోసం ప్రతి ఏటా 1450 కోట్ల రూపాయల ప్రీమియం చెల్లిస్తున్నాము.

దాదాపు 17వేల కోట్ల రూపాయల రుణ మాఫీ చేశాం.కల్లాల దగ్గర ధాన్యం కొనుగోలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం.

తెలంగాణలో అమలవుతున్న ఈ పథకాలు చూసి ఓర్వలేక కొంతమంది బీజేపీ నేతలు గంగిరెద్దుల వలె వచ్చి అవాకులు, చెవాకులు పేలుతున్నారు.

బీజేపీ పాలించే రాష్ట్రాల్లో ఇలాంటి పథకాలు ఉంటే అక్కడి నేతలు ఇక్కడకు వచ్చి మాట్లాడాలి.లేకపోతే ఇక్కడ మాట్లాడే నైతిక హక్కు లేదు.తెలంగాణలో రైతులు కడుపు నిండి ఉన్నారు.

అనవసరంగా వారిని రెచ్చ గొట్టవద్దు.రైతు కడుపు మందితే ప్రధానిని రోడ్ మీద నిలబెట్టారు.

ఇక్కడకు వచ్చే బీజేపీ నేతలు ఆ పరిస్థితి తెచ్చుకోవద్దు.

పార్లమెంట్లో తెలంగాణ పథకాలు బాగున్నాయని కేంద్ర మంత్రులు స్వయంగా చెప్పారు.

అధికారులు ఇక్కడకు వచ్చి అధ్యయనం చేశారు.ఇవన్నీ బీజేపీ నేతలు తెలుసుకుని ఇక్కడకు వచ్చి మాట్లాడితే బాగుంటుంది.

తెలంగాణలో ప్రతి ప్రాంత, ప్రతి వర్గం అవసరాలు తెలిసిన నాయకులు కేసిఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉండడం అదృష్టం.ఒక తండ్రి వలె ఆలోచించిన సీఎం కేసిఆర్ గారు తెలంగాణలో గర్భిణీ స్త్రీలు, బాలింతల ఆరోగ్యం కోసం ఆరోగ్య లక్ష్మి పథకం అమలు చేస్తున్నారు.

గిరిజన గ్రామాలకు 3 ఫేజ్ కరెంట్ ఉండాలని రూ.250 కోట్లు ఇచ్చారు.75 ఏళ్లుగా నెరవేరని కల ఇప్పుడు నెరవేరుతుంది.కొమురం భీమ్ ఇన్ని రోజులు పాలించిన పార్టీలకు ఎందుకు గుర్తు రాలేదు.

తెలంగాణ ప్రభుత్వం వచ్చాకే కొమురం భీం ఉద్యమ నాయకుని ప్రాంతం జోడేఘాట్ ను 30 కోట్ల రూపాయల తో కట్టించారు.హైదరాబాద్ లో 50 కోట్ల రూపాయలతో కొమురం భీం, గిరిజన భవన్ కడుతున్నాం.

గత పాలకులు గిరిజనులు పేదవాళ్ళను ఓటు బ్యాంక్ గానే చూశారు.సీఎం కేసిఆర్ గారు వచ్చిన తరవాతే వారికి సంక్షేమం, అభివృద్ధి, ఆత్మ గౌరవం దక్కింది.

అందుకే మొదటి సారి కంటే రెండో సారి 15 సీట్లు ఎక్కువ ఇచ్చి గెలిపించారు.మూడోసారి అంతకంటే ఎక్కువ సీట్లు ఇచ్చి గెలిపిస్తారు.

మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గారి నేతృత్వంలో అటవీ, దేవాదాయ శాఖలో సమర్థవంతంగా పనులు జరుగుతున్నాయి.పోడు భూములకు త్వరలో పట్టాలు వస్తాయి.

ఆ భూములకు నీరు, కరెంట్ సదుపాయం ఇచ్చి సాగు యోగ్యం చేస్తాం.రైతు బంధు, రైతు బీమా కూడా ఇస్తాం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube