శ్రీరామచంద్రకు అదిరిపోయే ఆఫర్ ఇచ్చిన ఆహా.. ఏకంగా తెలుగు ఇండియన్ ఐడల్‌ కు హోస్ట్ గా?

సింగర్ శ్రీ రామ చంద్ర గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒక పాపులర్ సింగర్ గా శ్రీ రామ చంద్ర ఒక గుర్తింపు ఏర్పరుచుకున్నారు.

 Aha Given Unexpected Offer To Sri Ramachandra As A Host To The Indian Idol, Sri-TeluguStop.com

తనకున్న క్రేజ్ తోనే బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టాడు.బిగ్ బాస్ హౌస్ లో తన ఆటలతో, పాటలతో, డాన్స్ లతో ప్రేక్షకులను మెప్పించాడు.

శ్రీరామ్ అభిమానులు తప్పకుండా టైటిల్ విన్నర్ అవుతాడన్న నమ్మకంతో ఉన్నారు. కానీ చివరికి బిగ్ బాస్ లో టాప్ ఫైవ్ కంటెస్టెంట్ లలో టాప్ త్రీ కంటెస్టెంట్ గా నిలిచాడు.

ఇక ఒకానొక దశలో అయితే సింగర్ శ్రీరామ్ ఖచ్చితంగా బిగ్ బాస్ టైటిల్ విన్నర్ గా గెలుస్తారన్న వార్తలు కూడా వినిపించాయి.

అయితే బిగ్ బాస్ హౌస్ లోకి కేవలం తెలుగు ప్రేక్షకులకు చేరువ అవ్వాలన్న ఏకైక ఆశయంతోనే అడుగు పెట్టానని తెలిపారు శ్రీరామ్.

అనుకున్న విధంగానే ఎంతోమంది తెలుగు ప్రేక్షకుల మనసులో స్థానం సంపాదించుకున్నారు. ఇదిలా ఉంటే తాజాగా అదిరిపోయే ఆఫర్‌ అందుకున్నాడు శ్రీ రామ్.

ప్రముఖ తెలుగు ఓటీటీ ఆహా తర్వలో ఇండియన్‌ ఐడల్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు మన అందరికి తెలిసిందే.అయితే ప్రోగ్రామ్‌కు హోస్ట్‌గా శ్రీరామచంద్రను సెలెక్ట్‌ చేశారు ఆ షో నిర్వాహకులు.

Telugu Bigg Boss, Indian Idol, Sri Ramachandra, Tollywood-Movie

ఇందుకు సంబంధించిన విషయాన్ని ట్విటర్‌ వేదికగా ప్రకటించారు ఆహా మేకర్స్‌.అయితే ఇదివరకు శ్రీరామచంద‍్ర 2013లో ఇండియన్‌ ఐడల్‌గా హిందీలో గెలుపొందిన విషయం మనకు తెలిసిందే.శ్రీ రామ్ మధురమైన స్వరానికి అనేక మంది సంగీత దర్శకులు, సింగర్స్‌ మంత్రముగ్ధులయ్యారు అనడంలో ఎటువంటి సందేహం లేదు.తెలుగు ఇండియన్‌ ఐడల్‌ కార్యక్రమానికి శ్రీరామచంద్ర హోస్టింగ్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.

ఇండియన్‌ ఐడల్‌లో హిందీలో సింగర్‌గా అలరించిన శ్రీరామ చంద్ర హోస్ట్‌గా ఎంతవరకు మెప్పిస్తాడో చూడాలి మరి.ఈ షో ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని శ్రీరామ్ అభిమానులతో పాటు తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.ప్రస్తుతం ఆడిషన్స్‌ జరుపుకుంటున్న తెలుగు ఇండియన్‌ ఐడల్‌ త్వరలోనే ప్రారంభం కానుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube