వైరల్ వీడియో: 'రారా స్వామి' అంటున్న టీమిండియా క్రికెటర్ భార్య..!

అల్లు అర్జున్, రష్మిక మందన హీరోహీరోయిన్లుగా నటించిన పుష్ప సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన విషయం తెలిసిందే.ఈ మూవీ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ మరీ హై రేంజ్‌లో ఏం లేదు కానీ సాంగ్స్ మాత్రం అదిరిపోయేలా కంపోజ్ చేశాడు దేవిశ్రీ.

 Yuzvendra Chahal Wife Dance Push Movie Song Viral Vodeo Viral Latest, Viral New-TeluguStop.com

చూపే బంగారమాయేనా శ్రీవల్లి, దాక్కో దాక్కో మేక పాటలతో పాటు నా సామి రారా సామి అనే పాట కూడా సూపర్ హిట్ అయింది.ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ పాటలే వినిపిస్తున్నాయి.

సోషల్ మీడియాలోనూ పుష్ప పాటలే కనిపిస్తున్నాయి.సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ పుష్ప సినిమాలోని పాటలకు రీల్స్ చేస్తున్నారు.

మొన్నీమధ్య రవీంద్ర జడేజా కూడా పుష్ప సినిమాలోని ఓ డైలాగు చెప్పి ఆశ్చర్యపరిచాడు.ఈ నేపథ్యంలో తాజాగా ఒక క్రికెటర్ భార్య పుష్ప మూవీలోని నా సామి పాటకు డ్యాన్స్ స్టెప్పులు వేసి ఆశ్చర్యపరుస్తోంది.

టీమిండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ భార్య ధన​శ్రీ వర్మకు ప్రత్యేకంగా ఇంట్రడక్షన్ అవసరం లేదు.ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ అందాల భామకు 43 లక్షల ఫాలోవర్లు ఉన్నారంటే అతిశయోక్తి కాదు.

వృత్తిపరంగా డాక్టర్ అయిన ధన​శ్రీ కాలక్రమేణా యూట్యూబర్, కొరియోగ్రాఫర్‌గా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు దక్కించుకుంది.ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె తన భర్త చాహల్ తో కలిసి దిగిన ఫొటోలతోపాటు డ్యాన్స్ వీడియోలను షేర్ చేస్తూ ఉంటుంది.

ఈ క్రమంలో తాజాగా ఆమె పుష్పలోని ‘రా రా సామి‘ సాంగ్‌కు స్టెప్పులేసి ఫ్యాన్స్‌ను ఆశ్చర్యచకితులను చేసింది.ఈ పాటలో రష్మిక వేసిన స్టెప్పులను కాస్త మార్చి చేస్తూ ఆమె అద్భుతంగా డ్యాన్స్ చేసి అందర్నీ ఫిదా చేసింది.ముంబై భామ అయినప్పటికీ మన తెలుగు వెర్షన్ లోని పాటకు నాట్యం చేయడంతో తెలుగు ప్రేక్షకులు ఈ వీడియోని చూసి ఫిదా అవుతున్నారు.ముఖ్యంగా బన్నీ ఫ్యాన్స్ మురిసిపోతున్నారు.

బాహుబలి తర్వాత మళ్లీ నేషనల్ వైడ్ గా సెలబ్రిటీలను కూడా మెప్పిస్తున్న సినిమాగా పుష్ప నిలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube