ముంబైలో రామ్ చరణ్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ..బారికేడ్లు బద్దలు?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తనయుడు గా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరచుకున్నారు.

 Mumbai, Ram Charan , Rrr Promotions, Jr Ntr,latest News-TeluguStop.com

రామ్ చరణ్ కు కేవలం తెలుగు సినీ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా మిగిలిన ఇండస్ట్రీలలో కూడా భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.మరీ ముఖ్యంగా చెప్పాలి అంటే బాలీవుడ్ ఇండస్ట్రీ లో రామ్ చరణ్ కి బీభత్సమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది.

తాజాగా జరిగిన ఒక సంఘటన ఇందుకు చక్కని ఉదాహరణగా చెప్పుకోవచ్చు.

తాజాగా ఆర్ఆర్ఆర్ చిత్ర బృందం సినిమా ఈవెంట్ కోసం ముంబైకి వెళ్లారు.

అక్కడ రామ్ చరణ్ కోసం అభిమానులు బార్లు కట్టారు.రామ్ చరణ్ ని చూడడం కోసం అక్కడ అభిమానులు బీభత్సం సృష్టించారు.

రామ్ చరణ్ ని చూడడానికి వచ్చిన అభిమానులు గేట్లు బద్దలు కొట్టుకుని మరి లోపలికి రావడానికి ప్రయత్నించారు.అయితే వారిని అదుపు చేయడం అక్కడ ఉన్న సెక్యూరిటీ వల్ల కాలేదు.

రామ్ చరణ్ ను ఎలా అయినా చూడాలి అన్న ఎగ్జైట్మెంట్ తో అక్కడ ఉన్న భారీకేరడ్స్​ని నెట్టుకుని మరీ లోపలికి వచ్చేసారు అభిమానులు.ఇందుకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Telugu Jr Ntr, Mumbai, Ram Charan, Rrr-Movie

టాలీవుడ్ హీరో కి బాలీవుడ్ లో కూడా ఈ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందా అంటూ అక్కడున్నవారంతా ఆశ్చర్యపోతున్నారు.రామ్ చరణ్ నటించిన మగధీర సినిమాతో అన్ని భాషల్లో ఫేమస్ అయ్యాడు.ఎనిమిదేళ్ల క్రితం జంజీర్ ఈ సినిమాతో బాలీవుడ్ ప్రేక్షకులను పలకరించాడు రామ్ చరణ్.ఆ సినిమా మాత్రమే కాకుండా రామ్ చరణ్ నటించిన సినిమాలు హిందీలో డబ్బింగ్ అయి విడుదల అవుతుంటాయి.

రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటించిన తాజా చిత్రం ఆర్ఆర్ఆర్.ఈ సినిమా కోసం చెర్రీ అభిమానులు ఎంతగానో వేచి చూస్తున్నారు.ఈ సినిమా జనవరి 7న విడుదల కానున్న విషయం తెలిసిందే.పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమా విడుదల కానుంది.

ఈ సందర్భంగా చిత్ర బృందం ఇప్పటికే ప్రమోషన్స్ ను వేగవంతం చేసింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube