అయ్యన్నవి మందు మాటలు, మత్తు మాటలు, గంజాయి మాటలు : ఎమ్మెల్యే ఉమా శంకర్ గణేష్

ఎమ్మెల్యే ఉమా శంకర్ గణేష్ మాట్లాడుతూ.ఇంకా ఏమన్నారంటే…

 Mla Uma Shankar Ganesh Fires On Ayyanna Patrudu, Narsimpatnam Mla, Ayyanna Patr-TeluguStop.com

1- అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలు చూసినవారికి, ఆయన కాఫీ, టీలు తాగడం మానేసి, రెండున్నరేళ్ళు అయిందని, కేవలం మందు మాత్రమే తాగి మాట్లాడుతున్నాడని అర్థమవుతుంది.

2- ఓడిన తర్వాత అయ్యన్నపాత్రుడుకు దిక్కుతోచడం లేదు.నీళ్ళలో నుంచి ఒడ్డున పడిన చేప ఎలా గిలగిలా కొట్టుకుంటుందో… ఆయనా అలాగే గిలగిలా కొట్టుకుంటున్నాడు.

3- అయ్యన్నపాత్రుడు పేరు చెబితే, చంద్రబాబు హయాంలో మంత్రిగా అతను ఏం చేశాడంటే.గంజాయి రవాణా తప్ప మరొక్క విషయం కూడా ఎవరికీ గుర్తుకు రాదు.

4- జగన్ మోహన్ రెడ్డిగారి గురించి ఆయన వ్యాఖ్యలు బహుశా జగన్ గారి మీద కాక చంద్రబాబు మీద చేసినవిగా భావించాలి.2019 ఎన్నికల్లో మాత్రమే కాక, ఆ తర్వాత జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ ఓడిపోయిన తమ అధ్యక్షుడికి సిగ్గు, లజ్జ లేదా అన్నది బహుశా అయ్యన్నపాత్రుడి అభిప్రాయం అయి ఉండవచ్చు.

5- తండ్రి మీదే కాక, కొడుకు చేతిలో ఓడిపోయిన చంద్రబాబుకు సిగ్గు, లజ్జ ఉన్నాయని ఎవరన్నా అనుకుంటారా.తన కొడుకును ఓడగొట్టుకున్న చంద్రబాబుకు సిగ్గు, లజ్జ ఉన్నాయని ఎవరైనా అనుకుంటారా.? – అప్పును అవినీతికి ఉపయోగించిన చంద్రబాబుకు సిగ్గు, లజ్జ ఉన్నాయని ఎవరైనా అనుకుంటారా.? – సిగ్గుపడి రాజీనామా చేయాల్సింది చంద్రబాబు నాయుడా లేక ప్రతి రూపాయిని ప్రజల కోసం ఖర్చు పెట్టిన జగన్ గారా.?

6- కోర్టు కేసులన్నీ దొంగ కేసులు అయినప్పుడు, టీడీపీ పెట్టిన కేసులు అయినప్పుడు, వాటిని చూపి పదేళ్ళుగా బురద పూస్తున్నప్పుడు, ప్రజలు ఛీ అని తిరస్కరిస్తున్నప్పుడు సిగ్గు పడాల్సింది ఎవరు.సిగ్గు అంటూ ఉంటే చంద్రబాబే సిగ్గు పడాలి.

7- ఇక, స్కిల్ డెవలప్ మెంటు స్కాం సంగతి చూద్దాం.స్కిల్ డెవలప్ మెంటు స్కాం జరిగితే.

ప్రేమ చంద్రారెడ్డిని ఎందుకు అరెస్టు చేయలేదు అని అయ్యన్నపాత్రుడు అడగటం చూస్తే… ఇదే విషయాన్ని చంద్రబాబు కూడా మాట్లాడటం చూస్తే, ఈ రాష్ట్ర ప్రజలందరికీ ఒక విషయం రూఢి అయింది.ఖచ్చితంగా ఇందులో రూ.241 కోట్లు అప్పనంగా కొట్టేశారని.సంతకం పెట్టింది ఎవరు అన్నది కాదు, బస్తాల్లో డబ్బులు పట్టుకుపోయింది ఎవరన్నదే ముఖ్యం.– అందులో చంద్రబాబుకు నేరుగా అంతా చేరిందన్న భయంతోనే అయ్యన్నపాత్రుడిని మొరగమని బాబు ఆదేశించాడా.?

8- ఒక్క రాజధాని కాదు, మూడు రాజధానులు కావాలని రాయలసీమలో ప్రజలు తిరుపతిలో నిలదీస్తుంటే… దాని నుంచి ఎలాగో  మీడియాకు మేత కోసం అయ్యన్నపాత్రుడుతో మందు మాటలు, మత్తు మాటలు, గంజాయి మాటలు, మతి లేని మాటలు మాట్లాడించి డైవర్ట్ చేయాలని నానా తంటాలు పడుతున్నారు.

9- పిచ్చి వాళ్ళతో ప్రెస్ మీట్లు పెట్టించి పిచ్చి కూతలు కూయించడం వల్ల ప్రయోజనం ఉండదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube