సన్నీని ఓటమి పాలు చేసేందుకు బిగ్ బాస్ పన్నగాం.. ఆ మాస్టర్ ప్లాన్ హిట్టా.. ఫట్టా?

బిగ్ బాస్ మరి రెండు రోజులలో ముగిసిపోవడంతో టైటిల్ విజేత ఎవరు అనే విషయంపై రెండు రాష్ట్రాలలో తీవ్ర ఉత్కంఠ ఏర్పడింది.ప్రస్తుతం హౌస్ లో ఉన్న కంటెస్ట్ ల ఓట్స్ చూస్తే మొదటి స్థానంలో సన్నీ, రెండవ స్థానంలో షణ్ముఖ్, మూడవ స్థానంలో శ్రీ రామచంద్ర, మానస్, సిరి వరుసగా నాలుగు ఐదు స్థానాల్లో ఉన్నారు.

 Bigg Boss Master Plan To Make The Sunny Out Is The Plan Hit Or Flop Details, Big-TeluguStop.com

అయితే శ్రీ రామచంద్రకు రోజురోజుకు మద్దతు పెరగడంతో ఇతను రెండవ స్థానంలో రావడం కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు.ఇక సన్నీ విజేత అవుతారంటూ చాలామంది భావిస్తున్న సమయంలో బిగ్ బాస్ సన్నీని ఓటమి పాలు చేయడం కోసం పెద్ద ఎత్తున ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది.

నిన్నటి ఎపిసోడ్ లో భాగంగా బిగ్ బాస్ సన్నీని విజేతగా నిలబెట్టే ఉద్దేశ్యం లేదని తెలుస్తోంది.ఇక నిన్నటి ఎపిసోడ్ లో భాగంగా నిన్న రాత్రి 11 గంటల 30 నిమిషాల వరకు ఓటింగ్ వేసే అవకాశం ఉండడంతో పెద్ద ఎత్తున ఓట్లు పోల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

ఈ క్రమంలోనే విన్నర్ రేస్ నుంచి సన్నీని తప్పించడం కోసం బిగ్ బాస్ మాస్టర్ ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది.ఈ పథకంలో భాగంగా సిరి ఎలిమినేషన్ అంటూ ఫేక్ ప్రోమో విడుదల చేశారు.

హౌస్ లో ఉన్న ఐదుగురు సభ్యుల్లో ఒకరు బయటకు వెళ్లాల్సి ఉంటుందని సిరిని పంపించడంతో ఈ పథకానికి ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది.

సిరి పేరు చెప్పగానే సిరి నేను బయటకు వెళ్లను అంటూ ఏడుస్తూ కూర్చున్నప్పటికీ తనని బిగ్ బాస్ హౌస్ నుంచి పంపించినట్టు చూపించారు.

Telugu Bigg Boss, Bigg Boss Siri, Manas, Master, Siri, Sri Ramachandra, Sunny, S

ఇలా ఫేక్ ప్రోమోతో ఒక్కసారిగా ఆడియన్స్ ను బిగ్ బాస్ అయోమయంలో పడేసారు.సిరి బయటకు వెళ్లడానికి కారణం సన్నీ కనుక చాలా మంది సన్నీ పై నెగిటివ్ అభిప్రాయాలు ఏర్పరుచుకుని సింపతి ఓట్లు వేసే అవకాశాలు కూడా ఉన్నాయి.ఈ క్రమంలోనే సిరి ఎలాగో ఎలిమినేషన్ అయింది కనుక సిరి ఎలిమినేషన్ కు కారణం సన్నీ కావడంతో అతనిపై నెగిటివిటీని క్రియేట్ చేసి ఆ సింపతి ఓట్లు షణ్ముఖ్ కి పడేలా ప్లాన్ చేశారని తెలుస్తోంది.

Telugu Bigg Boss, Bigg Boss Siri, Manas, Master, Siri, Sri Ramachandra, Sunny, S

నిన్న సాయంత్రం నాలుగు గంటలకు సిరి ఎలిమినేషన్ అంటూ ప్రోమో విడుదల చేశారు.ఇక ఈ ప్రోమో విడుదలైనప్పటి నుంచి తన ఎలిమినేషన్ ఫేకా లేదా నిజమా అని తెలుసుకోవడానికి సాయంత్రం ఎపిసోడ్ చూడాల్సి ఉంటుంది.అయితే ఈ ఎపిసోడ్ పూర్తి అయ్యేసరికి ఓటింగ్ టైం కూడా అయిపోవడంతో దాదాపు ఏడు గంటల పాటు సన్నీ ఓట్లకు గండి పడినట్టు అయ్యింది.

ఈ విధంగా బిగ్ బాస్ వేసిన పథకం చూస్తుంటే విజేతగా సన్నిని ప్రకటించే ఉద్దేశం లేదని అర్థమవుతుంది.ఇలా ఓటింగ్ శాతాన్ని తగ్గించడం కోసమే బిగ్ బాస్ ఇలాంటి పథకాన్ని వేశారని సమాచారం.

మరి బిగ్ బాస్ వేసిన ఈ ప్లాన్ ఫలిస్తుందా లేకపోతే సన్నీ విజేతగా నిలబడతాడా అనేది మరొక రోజులో తెలియనుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube