అఖండ సినిమా ప్రపంచవ్యాప్తంగా 65 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లను సాధించింది.రేపు పుష్ప రిలీజ్ కానుండటంతో అఖండ మూవీ జోరు తగ్గే అవకాశం ఉంది, రాబోయే నెలరోజుల్లో థియేటర్లలో భారీ సంఖ్యలో సినిమాలు రిలీజ్ కానున్నాయి.
అఖండ సినిమా గురించి పలువురు రాజకీయ ప్రముఖులతో పాటు సినీ సెలబ్రిటీలు సైతం పాజిటివ్ గా స్పందించి సినిమాను ప్రమోట్ చేశారు.అయితే అఖండ గురించి చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకులు రంగరాజన్ పంతులు మీడియాతో మాట్లాడారు.
గత వారం తాను అఖండ సినిమాను చూశానని గత వారమే చెప్పాలని అనుకున్నా కొన్ని కారణాల వల్ల చెప్పలేకపోయానని రంగరాజన్ పంతులు పేర్కొన్నారు.అఖండ సినిమాలో ధర్మానికి ఎంత నష్టం జరుగుతుందో ప్రత్యక్షంగా చూపించారని ఆయన అన్నారు.
ధర్మంను రక్షించడం కొరకు మనమంతా కలిసి పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన కామెంట్లు చేశారు.
అఖండ సినిమాకు పని చేసిన వాళ్లకు దేవుని అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని కోరుకుంటున్నానని రంగరాజన్ పంతులు అన్నారు.ఈ సినిమాను ఎక్కువమంది ఎందుకు చూస్తున్నారంటే వాళ్ల మనస్సులో ఉక్రోషం, ఆక్రోషం ఉందని ఆయన తెలిపారు.వాళ్లలో ఏమీ చేయలేకపోతున్నామని ఆందోళనతో ఉన్న కోపం ఉందని రంగరాజన్ పంతులు పేర్కొన్నారు.
రాజ్యాంగం ఉన్నా ధర్మానికి అన్యాయం జరుగుతోందని ఆయన చెప్పుకొచ్చారు.
అందరి మనసులలో రామరాజ్య స్థాపన కావాలని కోరిక ఉందని కానీ ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నాం కాబట్టే సినిమా సక్సెస్ సాధించిందని రంగరాజన్ పంతులు తెలిపారు.
ఈ విషయాన్ని పాలకులు గుర్తించాలని ఆయన అన్నారు.రంగరాజన్ పంతులు చేసిన కామెంట్లు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
పుష్ప రిలీజైన తర్వాత అఖండ ఏ స్థాయిలో కలెక్షన్లను సాధిస్తుందో చూడాల్సి ఉంది.మాస్ ప్రేక్షకులకు అఖండ మూవీ బాగా నచ్చింది.