సినిమాల ద్వారా సంపాదించిన డబ్బుతో ఆ పని చేస్తున్న ప్రభాస్.. ఏమైందంటే?

స్టార్ హీరో ప్రభాస్ ఒక్కో సినిమాకు 100 కోట్ల రూపాయల నుంచి 150 కోట్ల రూపాయల వరకు పారితోషికం తీసుకుంటున్నారు.ప్రస్తుతం టాలీవుడ్ లో ఈ స్థాయిలో పారితోషికం తీసుకుంటున్న స్టార్ హీరో ప్రభాస్ మాత్రమే అని చెప్పాలి.

 Star Hero Prabhas Invest His Remuneration In Farm House Details, Prabhas, Farm-TeluguStop.com

బాలీవుడ్ స్టార్ హీరోలను మించి ప్రభాస్ కు క్రేజ్ ఉండటంతో ఈ స్థాయిలో పారితోషికం ఇస్తున్నారు.అయితే ప్రస్తుతం సినిమాల ద్వారా సంపాదించుకున్న డబ్బుతో విలాసవంతమైన ఫామ్ హౌస్ ను కట్టిస్తున్నారని తెలుస్తోంది.

దాదాపుగా 12 సంవత్సరాల క్రితం పాన్ ఇండియా హీరోగా గుర్తింపును సొంతం చేసుకున్న ప్రభాస్ సైబర్ సిటీలో ఒక ఫామ్ హౌస్ ను కొన్నారు.అయితే ప్రభాస్ ఫామ్ హౌస్ ను కొనుగోలు చేసిన స్థలం రెవిన్యూ డిపార్టుమెంట్ కు సంబంధించిన స్థలం అంటూ ప్రభాస్ కు నోటీసులు జారీ అయ్యాయి.

ఆ తర్వాత ప్రభాస్ ఫామ్ హౌస్ కు సంబంధించి కోర్టులో సవాల్ చేయడం ప్రభాస్ కు క్లియర్ టైటిల్ లభించడం జరిగింది.

ప్రభాస్ కు అనుకూలంగా తీర్పు వచ్చిన నేపథ్యంలో ప్రభాస్ పాత ఫామ్ హౌస్ స్థానంలో సరికొత్త ఫామ్ హౌస్ ను నిర్మించనున్నారని తెలుస్తోంది.

Telugu Architect, Clear, Cyber, Farm, Panindia, Prabhas, Tollywood-Movie

ప్రభాస్ ముంబైకు చెందిన ప్రముఖ ఆర్కిటెక్ట్ కు ఈ బాధ్యతలు అప్పగించారని సమాచారం.ప్రభాస్ చేతిలో ప్రస్తుతం ఐదు సినిమాలు ఉన్నాయి.షార్ట్ గ్యాప్ లో ఈ ఐదు సినిమాలు రిలీజ్ కానున్నాయి.సినిమాల ద్వారా సంపాదించిన డబ్బును ప్రభాస్ తెలివిగా ఇన్వెస్ట్ చేస్తున్నారు.

Telugu Architect, Clear, Cyber, Farm, Panindia, Prabhas, Tollywood-Movie

ప్రభాస్ ఏపీలోని వరద బాధితుల సహాయార్థం సీఎం రిలీజ్ ఫండ్ కు కోటి రూపాయల విరాళం ప్రకటించిన విషయం తెలిసిందే.ఇతర హీరోలు ప్రకటించిన సహాయం కంటే ప్రభాస్ మూడు రెట్లు ఎక్కువ మొత్తం ప్రకటించడం గమనార్హం.సినిమాసినిమాకు ప్రభాస్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube