భార్య, మరదలితో స్టెప్పులేసిన చెర్రి... నెట్టింట్లో వైరల్ అవుతున్న వీడియో!

తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరదలు అనుష్పాల వివాహం తన ప్రియుడితో అంగరంగ వైభవంగా జరిగింది.ఈ పెళ్లి వేడుకలకు కామినేని కుటుంబంతో పాటు, హీరో రామ్ చరణ్ కుటుంబ సభ్యులు కూడా హాజరయ్యారు.

 Ram Charan Dance Upasana And Sister Law Anushpala Video Goes Viral, Upasana Sist-TeluguStop.com

అనుష్పాల వివాహం స్నేహితులు సన్నిహితులు కుటుంబ సభ్యుల సమక్షంలో అర్మాన్ ఇబ్రహీంతో అట్టహాసంగా జరిగింది.అనుష్పాల,అర్మాన్ గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు.

ఇక ఇరు కుటుంబ సభ్యులు వీరి వివాహానికి ఒప్పుకోవడంతో తాజాగా మూడు ముళ్ళ బంధంతో ఒక్కటయ్యారు.

ప్రస్తుతం వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

ముఖ్యంగా ఈ వివాహ వేడుకలో హీరో రామ్ చరణ్ అదిరిపోయే లుక్ లో దర్శనమిచ్చాడు.రామ్ చరణ్, ఉపాసన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

పెళ్ళికి 4 రోజులు ముందు నుంచే ఈ వివాహ వేడుకలో మొదలయ్యాయి.ఈ పెళ్లికి సంబంధించిన సంగీత్ ఫోటోలు, వీడియోలు, అలాగే దోమకొండ కోటలో జరిగిన పోచమ్మ పండుగలకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

ఈ పెళ్లిలో రామ్ చరణ్ ఉపాసనల జంట అట్రాక్షన్ గా నిలిచింది.

ఈ పెళ్లి వేడుకలో భాగంగా రామ్ చరణ్ తన భార్య ఉపాసన మరదలు అనుష్పాలతో కలిసి చిందులు వేసి సందడి సందడి చేశాడు.మ్యూజిక్ డైరెక్టర్ గా సాచెత్ తాండన్, పరంపరా ఠాకూర్ లు పాటలు పాడుతుంటే మరదలితో కలిసి డ్యాన్స్ చేశాడు చెర్రీ.దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ వీడియోను చూసిన మెగా అభిమానులు మురిసిపోతున్నారు.అంతే కాకుండా ఈ వీడియోని చూసి తమదైన శైలిలో స్పందిస్తున్నారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube