తెలుగు సినీ ప్రేక్షకులకు హీరోయిన్ సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.సినీ ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చి అతి తక్కువ కాలంలోనే హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పరుచుకుంది.
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఈమెకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళం, మలయాళంలో కూడా సాయి పల్లవి కి మంచి క్రేజ్ ఉంది.
ఇదిలా ఉంటే తాజాగా సాయి పల్లవి తన చెల్లెలు పూజకు విషెస్ చెబుతూ ఇన్స్టాగ్రామ్ లో లేఖ రాసింది.వివరాల్లోకి వెళితే.
ఈ రోజు తనకు చాలా ప్రత్యేకమైన రోజట.సాయి పల్లవి చెల్లెలు పూజా కన్నన్ నటించిన మొదటి సినిమా చిత్తిరై సేవానమ్.ఈ సినిమా తాజాగా జీ6 ఓటీటీ లో విడుదలయింది.ఈ సందర్భంగా సాయి పల్లవి తన చెల్లెలు పూజకు విషెస్ చెబుతూ ఇన్స్టాగ్రామ్ లో లేఖ రాసింది.
పూజ.నీ గురించి నాకు మాత్రమే తెలుసు.ఇప్పుడు నీ గురించి ప్రపంచమంతా తెలుసుకోనుంది.ఆరోగ్యం బాగాలేదని అమ్మా నాన్నకు చెప్పి బంక్ కొట్టడం, నిరాశగా ఉన్నప్పటికీ ఉత్సాహంతో ముందుకు వెళ్లడం,ఇలా ఆఫ్ స్క్రీన్ లోనే కాదు,ఇప్పుడు ఆన్ స్క్రీన్ లో కూడా నటిగా ఎదిగావ్.
ఈ రోజు నీ మొదటి చిత్రం విడుదల అవుతోంది.ఐ లవ్ యు.నీకు నేను ఎప్పటికీ తోడుగా ఉంటా.జీవితంలో నువ్వు ఇంకా ఎదగాలని కోరుకుంటున్నాను.
ఒక పాత్ర పోషిస్తున్నప్పుడు ఎంత ఆనందం కలుగుతుందో, అదేవిధంగా ప్రేక్షకుల ఆదరణ చూపించేటప్పుడు అంతే సంతోషంగా ఉంటుంది.నిన్ను చూసి నేను ఎప్పుడూ గర్వపడుతా అంటూ తన ప్రేమను వ్యక్త పరిచింది.
ప్రస్తుతం ఈ లేఖ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.