ఏపీ రాజకీయాల్లో సంచలనం చోటుచేసుకుంది.ఎవరూ ఊహించని విధంగా చడీ చప్పుడు లేని సునామీలా మూడు రాజధానులపై జగన్ ప్రభుత్వం వెనక్కు తగ్గింది.
సీఆర్డీఏను ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించారు జగన్.ఆయన ఇలా వెనక్కు తీసుకుంటారని ఎవరూ ఊహించలేదు.
ఓ వైపు చంద్రబాబు కన్నీళ్లు పెట్టుకున్న సందర్భంగా దేశ వ్యాప్తంగా జగన్ ప్రభుత్వం మీద విమర్శలు వస్తున్నాయి.ఈ తరుణంలోనే జగన్ ప్రభుత్వం ఎందుకు వెనక్కు తగ్గింది.
అసలు జగన్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి కారణాలేంటి అనేది అందరినీ వెంటాడుతున్న ప్రశ్నలు.
ఇక్కడ ఓ విషయం బాగా గమనిస్తే గనక కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం మూడు వ్యవసాయ చట్టాల మీద వెనక్కు తగ్గిన విషయం తెలిసిందే.
ఏడాదికి పైగా రైతులు చేస్తున్న ధర్నాకు దిగొచ్చిన మోడీ ప్రభుత్వం వీటిని వెనక్కు తీసుకుంది.ఇక వారంలోపే జగన్ కూడా రాజధాని రైతులు చేస్తున్న నిరసనలకు తలొగ్గి బిల్లులను వాపస్ తీసుకున్నారు.
ఎప్పుడైతే మోడీ ప్రభుత్వం వ్యవసాయ చట్టాలను వెనక్కు తీసుకున్నారో అప్పటి నుంచే జగన్ మీద కూడా ఒత్తిడి పెరిగిపోయింది.ఆయన కూడా మూడు రాజధాని బిల్లులను వెనక్కు తీసుకోవాలనే డిమాండ్లు బాగా వస్తున్నాయి.
ఈ నేపథ్యంలోనే జగన్ కూడా తలొగ్గారు.అయితే జగన్ మూడు రాజధానుల బిల్లు తెచ్చినప్పటి నుంచే కేంద్రం నుంచి ఆయన మీద ఒత్తిడి ఉందని చెబుతున్నారు.ఎందుకంటే మోడీ అమరావతిలో రాజధానికి శంకుస్థాపన చేశారు.కాబట్టి రాజధాని మారితే ఆయన మీద కూడా విమర్శలు వస్తున్నాయి.
ఇలా పరోక్షంగా విమర్శల పాలు కావాల్సి వస్తుండటంతో మోడీ, అమిత్ షా కూడా బిల్లులను వెనక్కు తీసుకోవాలని సూచించారంట.ఇక రెండున్నరేండ్లలో ఎన్నికలు ఉండటంతో ఇప్పటి నుంచే జనాలను తనవైపు తిప్పుకునే పనిలో భాగంగా జగన్ ఈ నిర్ణయం తీసుకుని అటు కేంద్రాన్ని, ఇటు రాజధాని రైతులను మెప్పించారని చెబుతున్నారు నిపుణులు.