ప్రతి సంవత్సరం మాఘ శుద్ధ సప్తమి రోజు రథసప్తమి వేడుకలను నిర్వహించుకుంటారు.ఈ రథసప్తమిని ఆ సూర్యభగవానుడికి ప్రతీకగా ఎంతో ఘనంగా నిర్వహించుకుంటారు.
అయితే ఈ రథసప్తమి వేడుకలలో భాగంగా ఉదయం స్నానాలు ఆచరించే సమయంలో తలపై జిల్లేడు ఆకులను పెట్టుకుని స్నానం చేయాలని చెబుతారు.తలపై కేవలం జిల్లేడు ఆకులని ఎందుకు పెట్టుకోవాలి? వేరే ఆకులను పెట్టుకొని స్నానం చేయవచ్చు కదా అనే సందేహం చాలామందికి కలుగుతుంది.అయితే సప్తమి రోజు జిల్లేడు ఆకులను ఎందుకు పెట్టుకోవాలి దాని వెనుక ఉన్న కారణం ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం…
పూర్వం అగ్నిష్వాత్తులు అనే పండితులు మహానిష్ఠతో చాలా యజ్ఞాలు చేశారు.వారి అజ్ఞానానికి పరమాత్మ తృప్తి చెంది వారిని స్వర్గానికి తీసుకురమ్మాని దేవ విమానం పంపారు.
అయితే అగ్నిష్వాత్తులు దేవమానం రావడం చూసి ఎంతో ఆనంద పడుతూ ఆతృతతో నెయ్యితో కూడిన హోమ ద్రవ్యాలను కంగారుగా హోమంలో వేశారు.అదే సమయంలో పెద్ద గాలి రావడంతో కొంత వేడివేడి నెయ్యి ప్రక్కనే ఉన్న ఒక మేకపై పడింది.
ఆ నెయ్యి వేడికి మేక చర్మం ఊడిపోయి మేక మరణించింది.ఆ విధంగా మేక మరణించడం వల్ల వీరందరి కన్నా ముందుగా మేక ఆత్మ వెళ్లి విమానంలో కూర్చుని స్వర్గ ప్రాప్తి పొందుతుంది.
అయితే ఆ మేక చర్మం పక్కనే ఉన్న చెట్టు పై పడింది.
ఆ విధంగా మేక చర్మం పడిన చెట్టు అప్పటి నుంచి తన మూలత్వాన్ని మార్చుకుని మెత్తటి ఆకులను ధరించి జిల్లేడు చెట్టుగా మారింది.అలా జిల్లేడాకు యజ్ఞంత సమయంలో ఆజ్యధారలు ధరించడంతో పరమపవిత్రం అయ్యింది.జిల్లేడు ఆకులను ముట్టుకుంటే మేక చర్మం మాదిరి మెత్తగా ఉండటానికి కారణం అదే.జరిగిన దానికి అగ్నిష్వాత్తులు బాధపడ్డారు.అప్పుడు ఆకాశవాణి, “మీరు దుఃఖించాల్సిన పనిలేదు.
మీరు చేసిన యజ్ఞఫలం ఆ మేకకు కూడా దక్కి, దుర్లభమైన స్వర్గప్రాప్తి కలిగింది”.ఆ విధంగా మేక చర్మంతో ఎంతో పవిత్రమైన ఈ జిల్లేడు వృక్షం అర్క వృక్షంగా మారింది.
అప్పటి నుంచి మాఘ శుద్ధ సప్తమి నాడు ఈ జిల్లేడు ఆకులను తలపై ఉంచుకుని స్నానం చేయటం వల్ల సర్వరోగాలు తొలగిపోతాయని, సూర్యుని అనుగ్రహం కోసం స్నానం చేసేవారికి పుణ్యఫలం కూడా లభిస్తుందని భావిస్తారు.
LATEST NEWS - TELUGU