ఈ రోజుల్లో సోషల్ మీడియాలో దాదాపు అన్ని విషయాలకు సంబంధించిన వీడియోలు ప్రత్యక్షమవుతున్నాయి.ముఖ్యంగా పెళ్లిళ్లకు సంబంధించిన వీడియోలు ఏ సోషల్ మీడియా సైట్ లో చూసినా కనిపిస్తున్నాయి.
ఎందుకంటే మ్యారేజ్ వీడియోలు చూసేందుకు నెటిజన్లు బాగా ఇష్టపడుతున్నారు.అందుకే ఇవి ఎక్కువగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారతున్నాయి.
తాజాగా అలాంటి మరో వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ వేదికగా చక్కర్లు కొడుతోంది.ఈ వీడియోలో వధూవరులిద్దరూ పోటాపోటీగా పుషప్స్ చేసి ఆశ్చర్యపరిచారు.
బ్రైడల్ లెహంగా డిజైన్ అనే ఇన్ స్టాగ్రామ్ పేజీ షేర్ చేసిన ఈ వీడియోకి వేలలో వ్యూస్, వందల్లో లైకులు వచ్చాయి.
వైరల్ అవుతున్న వీడియోలో వధూవరులిద్దరూ పెళ్లి వేడుకలలో పుషప్స్ చేయడం చూడొచ్చు.
వీరిద్దరూ ఫిట్నెస్ పై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారని తెలుస్తోంది.అయితే ఫిట్నెస్ విషయంలో తమలో ఎవరు గొప్ప అనేది తెలుసుకునేందుకు వీరు ఒక స్మాల్ ఛాలెంజ్ పెట్టుకున్నారు.
ఛాలెంజ్ లో భాగంగా వీరు తమ పెళ్లి వేడుకలో పుషప్స్ చేసి అందరినీ ఫిదా చేశారు.అయితే ఈ ఛాలెంజ్ లో ఎవరు గెలిచారు అనేది మాత్రం తెలియరాలేదు.
పెళ్లికొడుకు మాత్రం సునాయాసంగా పుషప్స్ చేస్తున్నట్లు కనిపించింది.ఇతను తన కాబోయే భార్యను గెలిపించి మొగుడిగా తాను కూడా గెలవాలని చిన్నగా, నెమ్మదిగా పుషప్స్ చేస్తున్నట్లు కనిపించింది.
ఏదేమైనా పెళ్లి వేడుకల్లో ఈ దృశ్యం చూసిన బంధుమిత్రులు అవాక్కయ్యారు.నెటిజనులు ఈ వీడియోపై ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.
ఈ వీడియోని మీరు కూడా చూసేయండి.