పుదు వసంతం, సూర్యవంశం వంటి తమిళ బ్లాక్ బస్టర్ సినిమాల ద్వారా ఎంతో ఫేమస్ అయినటువంటి డైరెక్టర్ విక్రమాన్ ( Vikraman ) తెలుగులో కూడా చెప్పవే చిరుగాలి, వసంతం వంటి సినిమాలకు దర్శకుడిగా వ్యవహరించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.ఇలా ఈయన దర్శకుడుగా కొనసాగుతున్న సమయంలోనే ఆయన సతీమణి జయ ప్రియ ( Jayapriya ) వెన్ను నొప్పితో బాధపడుతూ సర్జరీ చేయించుకున్నారు.
అయితే ఈ సర్జరీ కారణంగా ఈమె పూర్తిగా మంచానికే పరిమితం అయ్యారు.తాజాగా ఈ విషయాలన్నింటినీ జయప్రియ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఎంతో ఎమోషనల్ అయ్యారు.
సర్జరీ కారణంగా తాను అడుగు తీసి అడుగు పక్కన పెట్టలేకపోతున్నానని పూర్తిగా మంచానికే పరిమితం అయ్యానని తెలిపారు.ప్రతిరోజు ఇద్దరు నర్సులు తనకు ఇంటిలోనే హెల్ప్ చేస్తున్నారని ఈమె వెల్లడించారు అయితే నా చికిత్స కోసం నా భర్త సినిమాలలో సంపాదించిన ఆస్తులు అన్నింటిని కూడా అమ్మేసి తనకు ఖర్చు చేశారంటూ ఈమె ఆవేదన వ్యక్తం చేశారు.ఇలా డైరెక్టర్గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈయన భార్య ఆరోగ్యం కోసం ఆస్తులను అమ్ముకున్నారనే విషయం తెలియడంతో తమిళనాడు ప్రభుత్వం( Tamil Nadu Government) తన భార్యకు అండగా నిలిచింది.
డైరెక్టర్ విక్రమాన్ ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నటువంటి తమిళనాడు ప్రభుత్వం ఆయనని సంప్రదించారు.ఈ క్రమంలోనే ఆరోగ్య శాఖ మంత్రి సుబ్రమణియన్ ( Subramanian )స్వయంగా డైరెక్టర్ ఇంటికి వెళ్లి ఆయన సతీమణి జయప్రియను పరామర్శించారు.అనంతరం ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి మంత్రి ఆరా తీసారని తెలుస్తుంది.
డైరెక్టర్ భార్య ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నటువంటి మంత్రి తన భార్య వైద్య చికిత్స కోసం తమ ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.ఇలా తన భార్య ఆరోగ్యం కోసం ప్రభుత్వం అండగా నిలవడంతో డైరెక్టర్ విక్రమాన్ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, అలాగే వైద్య ఆరోగ్య శాఖ మంత్రికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.